Home

»

Latest News

దిల్ రాజు చేతికి 'ఖిలాడి' థియేట్రిక‌ల్ రైట్స్‌! ప్రొడ్యూస‌ర్ పంట పండింది!!

Jun 21, 2021 12:54PM

 

మాస్ మ‌హారాజా ర‌వితేజ మునుప‌టి సినిమా 'క్రాక్' బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ట‌వ‌డం 'ఖిలాడి' సినిమా ప్రొడ్యూస‌ర్‌కు బాగా క‌లిసొచ్చింది. ర‌మేశ్ వ‌ర్మ డైరెక్ష‌న్‌లో కోనేరు స‌త్య‌నారాయ‌ణ నిర్మిస్తోన్న ర‌వితేజ లేటెస్ట్ ఫిల్మ్ 'ఖిలాడి' థియేట్రిక‌ల్ రైట్స్‌ను దిల్ రాజు సొంతం చేసుకున్నారు. దీని కోసం ఆయ‌న భారీ మొత్తాన్నే వెచ్చించారు. అది.. రూ. 30 కోట్ల‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో ప్ర‌చారంలోకి వ‌చ్చింది. అదే నిజ‌మైతే నిర్మాత పంట పండిన‌ట్లే. ఈ సినిమాకు పెడుతున్న ఖ‌ర్చు కంటే ఎక్కువ‌గానే థియేట్రిక‌ల్ రైట్స్ రూపంలో వ‌చ్చేస్తే, ఇక శాటిలైట్‌, డిజిట‌ల్ రైట్స్ ద్వారా వ‌చ్చేదంతా ఆయ‌న‌కు అద‌న‌మే!

'ఖిలాడి' మూవీలో ర‌వితేజ డ్యూయ‌ల్ రోల్ చేస్తున్నారు. యాక్ష‌న్ కింగ్ అర్జున్ కీల‌క పాత్ర చేస్తుండ‌గా, మీనాక్షి చౌద‌రి, డింపుల్ హ‌య‌తి నాయిక‌లుగా న‌టిస్తున్నారు. 'జ‌న‌తా గ్యారేజ్' ఫేమ్ ఉన్ని ముకుంద‌న్‌, స‌చిన్ ఖ‌డేక‌ర్‌, రావు ర‌మేశ్‌, అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌, ముఖేశ్ రుషి, ముర‌ళీ శ‌ర్మ‌, వెన్నెల కిశోర్‌, నికితిన్ ధీర్‌, ఠాకూర్ అనూప్ సింగ్ లాంటి భారీ తారాతోర‌ణంతో నిర్మాణ‌మ‌వుతున్న ఈ చిత్రానికి దేవి శ్రీ‌ప్ర‌సాద్ సంగీతం అందిస్తుండ‌గా, అన్ని పాట‌ల‌నూ శ్రీ‌మ‌ణి రాశాడు.

వాస్త‌వానికి ఈ సినిమాని మే 28న విడుద‌ల చేయాల‌ని నిర్మాత‌లు సంకల్పించారు. అయితే మ‌హ‌మ్మారి సెకండ్ వేవ్‌తో షూటింగ్‌కు అంత‌రాయం క‌ల‌గ‌డంతో విడుద‌ల వాయిదాప‌డింది. ఇప్పుడు ఈ సినిమా థియేట‌ర్ హ‌క్కుల్ని దిల్ రాజు భారీ మొత్తానికి కొన‌డం ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com