Home

»

Latest News

రామ్ చరణ్ టార్గెట్ మిస్సయింది!

Aug 25, 2014

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ నటిస్తున్న 'గోవిందుడు అందరివాడేలే' దసరాకి మిస్ అయ్యే అవకాశ౦ వున్నట్లు సమాచారం. ఈ సినిమా పక్కాగా అక్టోబర్ 1 న రిలీజ్ చేయాలని యూనిట్ టార్గెట్ పెట్టుకుంది. కానీ ఇప్పుడు ఆ టార్గెట్ అందుకొనే అవకాశ౦ లేదట. ఎందుకంటే ఈ సినిమాలో కృష్ణవంశీ కొన్ని మార్పులు చేశారట. ఇప్పటికే ప్రకాష్‌రాజ్, జయసుధ పార్ట్ రీషూట్ వల్ల సినిమా చిత్రీకరణ లేట్ అయింది. కానీ ఫారిన్‌ షెడ్యూల్స్‌, పాటల షూటింగ్స్‌ వగైరా బ్యాలెన్స్‌ ఉడడంతో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా ఆలస్యం అవుతాయని ఇన్‌సైడ్ న్యూస్. పైగా డైరెక్టర్ కృష్ణవంశీ ఎడిటింగ్‌లో ఉంటే కథ నెల రోజుల్లో ఫస్ట్‌ కాపీ రెడీ చేయడమనేది సాధ్యం కాదట. కాబట్టి గోవిందుడు టార్గెట్ మిస్ అయ్యే చాన్సులు ఎక్కువని ఇండస్ట్రీ సమాచారం.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com