Home

»

Latest News

సౌండ్ ఇంజనీర్‌గా నారా రోహిత్.. వైరల్ అవుతున్న క్రేజీ టైటిల్ అనౌన్స్‌మెంట్.!

Jul 25, 2026 5:56PM

హీరో నారా రోహిత్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు ఒక మైండ్ బ్లోయింగ్ సర్ప్రైజ్ లభించింది. కథల ఎంపికలో ఎప్పుడూ వైవిధ్యం చూపే నారా రోహిత్ తన కొత్త సినిమా టైటిల్‌ను అధికారికంగా ప్రకటించారు. 

చినిమిల్లి మణికుమార్ దర్శకత్వంలో కరణ్ సి ప్రొడక్షన్స్ బ్యానర్ పై భరత్ చౌదరి నిర్మిస్తున్న ఈ నయా క్రేజీ ప్రాజెక్ట్‌కి 'సౌండ్ ఇంజనీర్' అనే వినూత్నమైన టైటిల్‌ను ఖరారు చేశారు. తాజాగా విడుదల చేసిన టైటిల్ అనౌన్స్‌మెంట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ వీడియో ఎంటర్టైనింగ్‌గా ఉంది. మైక్ పట్టుకుని అనౌన్స్‌మెంట్ చేసే క్రమంలో "స్కూల్‌కి వెళ్తున్న చిన్న పిల్లలకి, రీల్స్ చూస్తున్న యూత్‌కి, సీరియల్స్ చూస్తున్న ఆంటీలకు, సిట్టింగ్ వేస్తున్న అంకుల్స్‌కి, హనీమూన్ నుంచి సేఫ్‌గా వచ్చిన కపుల్స్‌కి స్వాగతం సుస్వాగతం" అంటూ సాగే డైలాగులు నవ్వులు పూయిస్తాయి. ఆ తర్వాత ప్రశాంతంగా కళ్లు మూసుకుని వినమని చెప్పగా, "ఏమీ వినపడటం లేదండి" అని వెనక నుంచి ఒక గొంతు అనడం, దానికి బదులుగా "వినపడదు.. ఎందుకంటే మావాడు ఒక పెద్ద సౌండ్ ఇంజనీర్" అంటూ టైటిల్ కార్డ్ రివీల్ చేయడం నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.

ఈ సందర్భంగా విడుదల చేసిన నారా రోహిత్ ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై ఉన్న అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. తెల్లటి సాంప్రదాయ దుస్తులు ధరించి ధ్యానం చేస్తున్నట్లుగా నారా రోహిత్ కనిపిస్తున్నారు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తుండటం విశేషం.

 

 

Nara Rohith, Sound Engineer, Title Announcement

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com