ఎవరు ఎక్కువ హాట్..?
on Jan 27, 2016

అవార్డ్స్ ఫంక్షన్ అనగానే ఒకప్పుడు ఏ సినిమాకు వస్తుంది, ఏ హీరోకి వస్తుంది అని చర్చలు జరిగేవి.. కానీ ఇప్పుడు మాత్రం, ఏ హీరోయిన్ ఎక్కువ హాట్ గా కనిపిస్తుంది. ఎవరు ఎక్కువ స్కిన్ షో చేస్తారు అని చర్చించుకుంటున్నారు జనాలు.. అందుకు కారణం లేకపోలేదు. సినిమాల్లో హీరోయిన్లు డ్రస్సుల్నికథావసరాల మేరకు వేసుకుంటారు.
కానీ నిజమైన డ్రస్సింగ్ టేస్ట్ ను చూపించాలంటే, వాళ్లకు ఉన్న ఏకైక బెస్ట్ స్పాట్ అవార్డ్స్ ఫంక్షన్స్. ఒకప్పుడు హాలీవుడ్ లో ఉన్న ఈ ట్రెండ్,బాలీవుడ్ కు చేరుకుంది. లేటెస్ట్ గా జరిగిన ఐఫా ఫంక్షన్స్ చూస్తే టాలీవుడ్ భామలు కూడా ఈ విషయంలో ఆరితేరిపోయారన్న విషయం స్పష్టంగా కనిపిస్తుంది..ఒకరిని మించి మరొకరు,అందాల ఆరబోతలో పోటీపడ్డారు.వీలైనంత స్కిన్ షో చేసి, అందరి కళ్లూ తమ వైపు తిప్పుకున్నారు. రెజీనా తన అందాల్ని కనిపించీ కనిపించవ్వని డ్రస్ వేస్తే, శ్రతి హాసన్ గౌన్ ఆమె అందాల్ని మరింత రెట్టింపు చేసింది. రాశీఖన్నా, రకుల్ ప్రీత్ సింగ్ లు బేర్ బ్యాక్ హాట్ డ్రస్ లతో మతులు పోగొట్టారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



