బన్నీ-అట్లీ ప్రాజెక్ట్ నుంచి సన్ పిక్చర్స్ అవుట్!
on Mar 12, 2025
'పుష్ప-2'తో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) తదుపరి సినిమాపై అందరిలో ఆసక్తి నెలకొంది. నిజానికి త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఒక సినిమా కమిటై ఉన్నాడు. కానీ, దాని కంటే ముందు.. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించాలని చూస్తున్నాడు.
బన్నీ-అట్లీ కాంబినేషన్ సినిమా గురించి ఎప్పటినుంచో వార్తలొస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ ని సన్ పిక్చర్స్ నిర్మించాల్సి ఉంది. కానీ, బడ్జెట్ ఏకంగా రూ.600 కోట్లు కావడంతో ఈ మూవీ విషయంలో వెనకడుగు వేయాలని సన్ పిక్చర్స్ నిర్ణయించుకున్నట్లు తమిళ్ మీడియాలో వార్తలొస్తున్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్.. దిల్ రాజు చేతికి వచ్చినట్లు కూడా అక్కడ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
'గేమ్ ఛేంజర్'తో పాన్ ఇండియా ఆశలు నెరవేరక.. నిరాశలో ఉన్న దిల్ రాజుకి ఒక సినిమా చేస్తానని అల్లు అర్జున్ మాట ఇచ్చినట్లు వార్తలొచ్చాయి. అంతేకాదు, ప్రశాంత్ నీల్ ఈ మూవీని డైరెక్ట్ చేసే ఛాన్స్ ఉందని కూడా తాజాగా ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు అనూహ్యంగా అట్లీ ప్రాజెక్ట్ తెరపైకి వచ్చింది.
సన్ పిక్చర్స్ తప్పుకోవడంతో బన్నీ-అట్లీ కాంబో ఫిల్మ్ దిల్ రాజు గడప తొక్కినట్లు తెలుస్తోంది. అయితే బడ్జెట్ విషయంలో దిల్ రాజు కూడా ఆలోచనలో పడ్డాడట.పైగా, అట్లీ కూడా ఏకంగా రూ.100 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు వినికిడి. అందుకే దిల్ రాజు ఇంకా కమిట్ మెంట్ ఇవ్వలేదట. బడ్జెట్, రెమ్యూనరేషన్ విషయంలో కొంచెం దిగొస్తే.. అప్పుడు తాను ప్రొడ్యూసర్ గా రంగంలోకి దిగడానికి ఓకే అని దిల్ రాజు చెప్పినట్లు న్యూస్ వినిపిస్తోంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
