Sumathi sathakam: సుమతీ శతకం రివ్యూ.. హిట్టా ఫట్టా!
on Feb 7, 2026

అమర్ దీప్ చౌదరి(Amardeep Chowdary),శైలి చౌదరి(Sayli M chaudhar)జంటగా నటించిన సినిమా 'సుమతీ శతకం'(Sumathi Sathakam).టేస్టీ తేజ, మహేష్ విట్టా ప్రధాన పాత్రలు చేశారు. నిన్న ఫిబ్రవరి 6న థియేటర్లలోకి అడుగుపెట్టింది. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం.
కథ ఏంటంటే
చిన్నతనం నుంచి ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుందామా అని ఎదురు చూసే, ఆరాట పడే యువకుడు కృష్ణ (అమర్ దీప్ చౌదరి). అతనికి ఆరాటానికి తగ్గట్టు ప్రతి పెళ్లి ప్రయత్నం విఫలమవుతుంది. అందుకు కారణం తూర్పు గోదావరి జిల్లాలోని తన సొంతూరు వైకుంఠపురంలో కిరాణా కొట్టు నడుపుతూ ఉండటం కూడా కారణం. ఆ అబ్బాయికి తమ ఊరికి దగ్గరలోని మరొక ఊరిలో అంగన్ వాడి టీచర్ సుమతి (శైలి చౌదరి) నచ్చుతుంది. ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని ప్రపోజ్ చేస్తాడు. నో చెప్పదు కానీ కృష్ణ ధైర్యానికి పరీక్ష పెడుతుంది. కృష్ణకి సుమతి పెట్టిన పరీక్ష ఏమిటి? సుమతి గ్రామస్తులతో కృష్ణకు ఏర్పడిన గొడవ ఏమిటి? సొంతూరిలోని గుడిలో జాతరకు పెళ్లి చేసుకోవాలని కృష్ణ అనుకోవడానికి కారణం ఏమిటి? సుమతి ఊరి గుడిలో ఏం జరిగింది? చివరకు వాళ్ళ పెళ్లి జరిగిందా? లేదా? అనేది సినిమా
సినిమా ఎలా ఉందంటే
అమర్ దీప్ చౌదరి కొంత విరామం తర్వాత హీరోగా చేసిన చిత్రమిది. వెండితెర పై తనని తాను కొత్తగా ఆవిష్కరించుకున్నాడు. కిరాణా కొట్టు కృష్ణగా ఒదిగిన తీరు ప్రశంసనీయం. పల్లెటూరి యువకుడిగా తూర్పుగోదావరి యాస పలికించడం, భావోద్వేగభరిత సన్నివేశాల్లో పరిణితి చూపించడం చక్కగా చేశారు. అవకాశం రావడంతో రెండు మూడు యాక్షన్ సన్నివేశాల్లో తనలో మాస్ హీరో కటౌట్ ఉందని నిరూపించుకున్నాడు. అతని తర్వాత కథలో కీలకమైన నాయిక పాత్ర పోషించిన శైలి చౌదరిది. అందంగా కనిపించింది. అంతకు మించి అణుకువగా నటించింది. టేస్టీ తేజ, మహేష్ విట్టా తమదైన రీతిలో వినోదం అందించారు. హీరోతో ఒకరు, ఊరి సర్పంచ్ పాత్రలో రీల్స్ పిచ్చి ఉన్న సోషల్ మీడియా సెలబ్రిటీగా మరొకరు నవ్వించారు.
పల్లెటూరి కథకి భక్తి, సందేశాత్మక అంశాలు మేళవించి కమర్షియల్ పంథాలో మాస్ సినిమా తీశారు 'సుమతీ శతకం' దర్శకుడు ఎంఎం నాయుడు. కథలో అసలు పాయింట్ దగ్గరకు చేరుకోవడానికి కొంత సమయం తీసుకున్నారు. కానీ ఒక్కసారి వెళ్లిన తర్వాత ప్రేక్షకుడ్ని కథ నుంచి బయటకు రానివ్వకుండా కనెక్ట్ అయ్యేలా కథనం సాగింది. ట్విస్ట్స్ పెద్దగా లేకపోవడం, ప్రెడిక్టబుల్ విలనిజం కావడం కొంత మైనస్ అని చెప్పవచ్చు. కానీ ఆ లోపాలను కవర్ చేసేలా ఎమోషనల్ సీన్స్ చేశారు. విజువల్స్ బాగున్నాయి. రూరల్ బ్యాక్‌డ్రాప్‌ని సినిమాటోగ్రాఫర్ ఎస్ హాలేష్ బాగా క్యాప్చర్ చేశారు. సుభాష్ ఆనంద్ ఇచ్చిన పాటల్లో పల్లెటూరి ఫీల్ వచ్చింది. నిర్మాత సాయి సుధాకర్ కొమ్మాలపాటి ఖర్చుకు రాజీ పడలేదు.
ఓవరాల్‌గా చెప్పాలంటే
గ్రామీణ నేపథ్యంలో వినోదాత్మక కథలు ఇష్టపడే ప్రేక్షకులకి 'సుమతీ శతకం' ఖచ్చితంగా నచ్చుతుంది. ఇంటర్వెల్, క్లైమాక్స్ థ్రిల్ ఇస్తాయి. ఆ రెండిటిలో షాక్ ఫ్యాక్టర్ ఉంది. అమర్ దీప్, శైలి చౌదరిల పెర్ ఫార్మెన్స్ మెయిన్ ఎస్సెట్.
rating 2.75/5
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



