రజనీ, సూర్యల తర్వాత బన్నీ...
on Nov 17, 2016
మెగా హీరోలందరిలోకి అల్లు అర్జున్ చాలా ప్రత్యేకంగా ఉంటారు..సినిమా సినిమాకు తనను తాను మార్చుకుంటూ కొత్తగా కనిపించేందుకు ట్రై చేస్తూ స్టైలిష్ స్టార్ అన్న పేరును సార్థకం చేసుకుంటూ ఉంటాడు. తన నటన, డ్యాన్స్ ద్వారా తెలుగునాట కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న అర్జున్‌కు ఇదే రేంజ్లో మళయాళంలోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బన్నీని కేరళవాసులు మల్లుఅర్జున్ అని పిలుస్తాంటరంటే మనోడి టాలెంట్ ఎంటో అర్థం చేసుకోవచ్చు.
రేసుగుర్రం, సరైనోడులతో యాభై కోట్ల క్లబ్లో చేరి రికార్డుల్లోకి ఎక్కిన ఈ అల్లువారబ్బాయి... తాజాగా మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అభిమానులకు మరింత క్లోజ్‌గా ఉండాలనే ఉద్దేశ్యంతో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాడు బన్నీ..తన సినిమాల ఆప్డేట్స్, పర్సనల్ విషయాలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ని ఖుషి చేస్తూ ఉంటాడు. మరి బన్ని పెట్టిన పోస్టులను అభిమానులు చూడకుండా ఉంటారా.?? ఇప్పుడు అలా చూసే వారి సంఖ్య ఒక మిలియన్‌కు చేరుకుని ఈ సరైనోడికి పెద్ద గుర్తింపును తెచ్చిపెట్టింది.
దీంతో రజనీకాంత్, సూర్యల తర్వాత దక్షిణాదిలో అత్యంత వేగంగా ఈ ఘనతను సాధించిన సెలబ్రిటీగా అర్జున్ రికార్డు సొంతం చేసుకున్నాడు. గత ఏడాది ఏప్రిల్‌లో ఆయన ట్విట్టర్ ఖాతాను తెరిచారు. ప్రారంభించిన ఏడాదిన్నర వ్యవధిలోనే బన్నీ ఫాలోవర్స్ మిలియన్ మార్క్‌ను టచ్ చేయడం విశేషం. ఆయన కంటే వెనుక ట్విట్టర్ ఎకౌంట్‌ను ఓపెన్ చేసిన వారు ఇంకా ఎక్కడో ఉంటే ఈ రేసుగుర్రం మాత్రం దూసుకుపోతోంది. ఈ సందర్భంగా మిలియన్ మార్కును చేరుకోవడానికి కారణమైన ప్రతి ఒక్కరికి ప్రేమతో ధన్యవాదాలు అంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేశాడు.