Home

»

Latest News

థియేటర్లలో పార్కింగ్‌ ఫీజు వసూలుకు ప్రభుత్వం అనుమతి

Jul 20, 2021 9:41PM

సినిమా థియేటర్ల వద్ద పార్కింగ్ ఫీజు వసూలుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. సింగిల్ స్ర్కీన్ థియేటర్ల వద్ద థియేటర్ యాజమాన్యం పార్కింగ్ ఫీజు వసూలు చేసుకోవచ్చని ఉత్తర్వులు జారీ చేసింది. మల్టీఫ్లెక్స్ లు, కమర్షియల్ కాంప్లెక్స్‌ వంటి వాటి విషయంలో మాత్రం నో పార్కింగ్ ఫీజు రూల్‌లో ఎటువంటి మార్పు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు జీవో నెం. 63ని సవరించింది. 

2018లో ఇకపై థియేటర్ల వద్ద పార్కింగ్ ఫీజు వసూలు చేయకూడదంటూ.. పార్కింగ్ ఫీజు రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవోని విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే కరోనా కారణంగా చాలా కాలం థియేటర్లు మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో థియేటర్ యజమానులు తెలంగాణ సర్కార్‌ ను కలిసి.. థియేటర్ వ్యవస్థను కాపాడాలని, పార్కింగ్ ఫీజు వసూలు చేసే వెసులుబాటు కల్పించాలని వినతి పత్రం సమర్పించారు. వారి వినతిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం.. థియేటర్ల వద్ద పార్కింగ్ ఫీజు వసూలుకు అనుమతి ఇచ్చింది.

కరోనా సెకండ్ వేవ్ కారణంగా మూతపడ్డ థియేటర్లు తెలంగాణలో ఈ నెల 23 నుంచి తెరుచుకోనున్న సంగతి తెలిసిందే. వందశాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు తిరిగి తెరుచుకోనున్నాయి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com