Home

»

Latest News

స్టార్ సింగర్ నడిరోడ్డు మీద చేసినపని కి అందరూ షాక్.. నువ్వు మాములోడివి కాదు సామి.!

Mar 20, 2024 4:25PM

అష్టా చెమ్మ మూవీలోని  ఆడించి అష్టా చెమ్మ ఓడించావమ్మా అనే సాంగ్  ద్వారా పాపులర్ అయిన గాయకుడు శ్రీ కృష్ణ..ఇప్పటి వరకు 150 పాటలకి పైనే పాడాడు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న దాదాపు అందరి హీరోలకి తన గళాన్ని అందించాడు. తాజాగా ఆయన చేసిన  ఒక పనికి ప్రశంసలు దక్కుతున్నాయి.

హైదరాబాద్ నగరంలో కొంత మంది దివ్యాంగులు పాటల కచేరి ఇస్తుంటారు. రోజుకొక ప్లేస్ లో పాడుతు ప్రజల్ని అలరిస్తూ ఉంటారు. ఆ సమయంలో వచ్చిన డబ్బుతో తమ జీవనాన్ని కొనసాగిస్తూ  ఉంటారు. ఇక  ఎప్పటిలాగే వారు ఒక ప్లేస్ లో పాటలు పాడుతున్నారు. అక్కడకి శ్రీ కృష్ణ  వెళ్లి వాళ్ళతో కలిసి కొన్ని పాటలు పాడాడు. పాడటమే కాదు వాళ్ళకి కొంత అమౌంట్ కూడా సాయం చేసాడు.అంతటితో ఆగకుండా తనలా మరింత మంది వారికి  సాయం చెయ్యాలని ఇనిస్టాగ్రమ్ వేదికగా తెలియచేసాడు.దివ్యాంగులకి సంబంధించిన  క్యూ ఆర్ స్కాన్ ని కూడా షేర్  చేసాడు.

ఎవరైనా సరే వాళ్ళకి సహాయం చెయ్యాలనుకుంటే ఆ స్కానర్ ద్వారా డబ్బుని పంపించవచ్చు.వాళ్ళ తో కలిసి పాడిన    పిక్స్ ని కూడా శ్రీ కృష్ణ  షర్ చేసాడు. ఇప్పుడు అవి  సంచలనం సృష్టిస్తున్నాయి..శ్రీ కృష్ణ  చేసిన పనికి అయితే  అందరు హాట్స్ ఆఫ్ చెప్తున్నారు.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com