Home

»

Latest News

‘జన నాయగన్’ పుణ్యమా అని ట్రెండింగ్‌లోకి శ్రీలీల.!

Jul 25, 2026 3:52PM

టాలీవుడ్ లో ఒకప్పుడు వరుస అవకాశాలతో దూసుకుపోయిన యువ నటి శ్రీలీల పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఇందుకు ప్రధాన కారణం విజయ్ హీరోగా నటించిన తాజా చిత్రం 'జన నాయగన్'. నందమూరి బాలకృష్ణ సూపర్ హిట్ సినిమా 'భగవంత్ కేసరి'కి ఇది రీమేక్‌గా తెరకెక్కింది. అయితే ఒరిజినల్ సినిమా ఇచ్చిన మ్యాజిక్‌ను తమిళ వెర్షన్ పూర్తిగా పునరావృతం చేయలేకపోవడంతో, ప్రస్తుతం సోషల్ మీడియా అంతా 'భగవంత్ కేసరి వర్సెస్ జన నాయగన్' పోలికలతో దద్దరిల్లిపోతోంది. ఈ నేపథ్యంలోనే ఒరిజినల్‌లో విజ్జి పాప పాత్రలో శ్రీలీల కనబరిచిన అద్భుతమైన నటనపై ప్రేక్షకులలో మళ్లీ ప్రశంసల వర్షం కురుస్తోంది.

తెలుగులో అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన 'భగవంత్ కేసరి' చిత్రంలో బాలకృష్ణ, శ్రీలీల పాత్రల మధ్య సాగే అనుబంధం ప్రేక్షకులను కంటతడి పెట్టించింది. ముఖ్యంగా క్లైమాక్స్‌లో భయం గుప్పిట్లో నుంచి ధైర్యంగా బయటకు వచ్చే సన్నివేశాల్లో శ్రీలీల చూపిన సహజత్వం సినిమాకే ఎంతో పెద్ద బలంగా నిలిచింది. థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆ సన్నివేశాలను మరో స్థాయికి తీసుకెళ్లింది. 

అయితే 'జన నాయగన్' విషయానికి వచ్చేసరికి, అమ్మాయి సెంటిమెంట్‌ను పక్కనపెట్టి రాజకీయ డైలాగులు, మాస్ ఎలిమెంట్లపై ఎక్కువ దృష్టి పెట్టారు. దీనివల్ల తమిళ వెర్షన్‌లో ఆ భావోద్వేగ లోతు మిస్ అయిందని ప్రేక్షకులు విమర్శిస్తున్నారు.

ఈ రీమేక్‌లో మమితా బైజు కూతురు పాత్రలో నటించినప్పటికీ, పాత్ర రూపకల్పనలో చేసిన మార్పుల వల్ల ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. తెలుగు వెర్షన్‌లో కథ మొత్తం విజ్జి పాప ఎమోషన్స్ చుట్టూ తిరిగితే, తమిళ వెర్షన్‌లో పొలిటికల్ హడావుడి ఎక్కువై ఆ పాత్రకు దక్కాల్సిన ప్రాధాన్యత తగ్గిపోయింది. 

దీంతో మమితా బైజు నటన కంటే, గతంలో శ్రీలీల చేసిన పాత్ర ఎంత గొప్పదో నెటిజన్లు పోల్చి మరీ మాట్లాడుకుంటున్నారు. “అసలు శ్రీలీల ఎంత బాగా నటించిందో జన నాయగన్ సినిమా మరోసారి గుర్తుచేసింది” అంటూ సోషల్ మీడియాలో రకరకాల పోస్ట్స్ వైరల్ అవుతున్నాయి. శ్రీలీలకు సరైన కథ, బలమైన ఎమోషనల్ పాత్ర పడితే ఆమె ఏ స్థాయిలో మెప్పించగలదో ఈ చర్చ మరోసారి నిరూపించింది.

 

 

Balakrishna, Bhagavanth Kesari, Sreleela, Bhagavanth Kesari, Mamitha Baiju

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com