Home

»

Latest News

శ‌ర్వానంద్‌కి త‌ప్ప‌ని పోటీ

Jan 25, 2021

యువ క‌థానాయ‌కుడు శ‌ర్వానంద్ ఖాతాలో హిట్ మూవీ చేరి చాలా కాల‌మే అయింది.  ప‌డి ప‌డి లేచె మ‌న‌సు, ర‌ణ‌రంగం, జాను.. ఇలా వ‌రుస ప‌రాజయాల‌తో శ‌ర్వా పూర్తిగా ట్రాక్ త‌ప్పాడు. ఈ నేప‌థ్యంలో.. అత‌నికో విజ‌యం త‌ప్ప‌నిస‌రి. శ‌ర్వానంద్ క‌మింగ్ ప్రాజెక్ట్ శ్రీ‌కారం.. ఆ ముచ్చ‌ట తీర్చే సినిమా అనే విష‌యం ప్ర‌చార చిత్రం, పాట‌ల‌తో స్ప‌ష్ట‌మ‌వుతోంది. రిలీజ్ డేట్ ని కూడా మ‌హాశివ‌రాత్రి స్పెష‌ల్ గా మార్చి 11ని ఫిక్స్ చేసుకున్నారు.

అయితే అదే రోజున మ‌రో రెండు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ బ‌రిలోకి దిగుతున్నాయి. ఆ చిత్రాలే.. జాతిర‌త్నాలు, గాలిసంప‌త్. ఏజెంట్ సాయి శ్రీ‌నివాస ఆత్రేయ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌రువాత టాలెంటెడ్ యంగ్ హీరో న‌వీన్ పోలిశెట్టి, బ్రోచెవారెవ‌రురా వంటి క్లాస్ హిట్ త‌రువాత మ‌రో టాలెంటెడ్ హీరో శ్రీ‌విష్ణు నుంచి వ‌స్తున్న సినిమాలి. అటు నవీన్ జాతిర‌త్నాలు, ఇటు శ్రీ‌విష్ణు గాలిసంప‌త్.. రెండు కూడా బ‌జ్ క్రియేట్ చేస్తున్న నేప‌థ్యంలో.. శ‌ర్వానంద్ కి పోటీ అనివార్య‌మైంది. మ‌రి.. ఈ పోటీలో శ‌ర్వానంద్ మ‌ళ్ళీ స‌క్సెస్ ని చూస్తాడో?  లేదో?  

కాగా, డెబ్యూ డైరెక్ట‌ర్ బి. కిషోర్ రూపొందిస్తున్న శ్రీ‌కారంలో శ‌ర్వానంద్ కి జంట‌గా గ్యాంగ్ లీడ‌ర్ ఫేమ్ ప్రియాంక అరుళ్ మోహ‌న్  న‌టిస్తోంది.
 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com