భారీ బడ్జెట్ మైథలాజికల్ ఫిల్మ్ లో ఇద్దరు స్టార్స్!
on Feb 11, 2026

జయాపజయాలతో సంబంధం లేకుండా విభిన్న చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు సుమంత్(Sumanth). గతేడాది 'అనగనగా'తో ఆకట్టుకున్న సుమంత్.. ప్రస్తుతం 'మహేంద్రగిరి వారాహి'(Mahendragiri Varahi) అనే సినిమా చేస్తున్నాడు. ఇది సుమంత్ కెరీర్ లోనే అత్యధికంగా రూ.25 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది.
రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ మైథలాజికల్ థ్రిల్లర్ కు సంతోష్ జాగర్లపూడి దర్శకుడు. 'సుబ్రహ్మణ్యపురం' తర్వాత సుమంత్-సంతోష్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రమిది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
'మహేంద్రగిరి వారాహి'కి సంబంధించి ఒక క్రేజీ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇందులో ఇద్దరు స్టార్స్ అతిథి పాత్రల్లో మెరవనున్నారని సమాచారం. ఆ ఇద్దరు ఎవరో కాదు.. సిద్ధు జొన్నలగడ్డ, కీర్తి సురేష్.

'డీజే టిల్లు', 'టిల్లు స్క్వేర్' సినిమాలతో యూత్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న సిద్ధు జొన్నలగడ్డ(Siddhu Jonnalagadda).. రవితేజ హీరోగా నటించిన 'మిస్టర్ బచ్చన్'లో గెస్ట్ రోల్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు 'మహేంద్రగిరి వారాహి'లో కూడా ఏడు నిమిషాల పాటు ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం.
ఇక కీర్తి సురేష్(Keerthy Suresh)కి అతిథి పాత్రలు కొత్త కాదు. చివరగా 'జాతి రత్నాలు'లో మెరిసింది. 'మహేంద్రగిరి వారాహి'లోనూ ప్రత్యేక పాత్రలో సందడి చేయనుందట.
సుమంత్ కెరీర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న 'మహేంద్రగిరి వారాహి'కి సిద్ధు జొన్నలగడ్డ, కీర్తి సురేష్ గెస్ట్ రోల్స్ ఏ మేరకు హెల్ప్ అవుతాయో చూడాలి.
Also Read: మొదటిసారి వెబ్ సిరీస్ చేస్తున్న రవితేజ!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



