Home

»

Latest News

విజయ్ ఫొటోలు లీక్.. రంగంలోకి సితార!

Jul 23, 2024 7:01PM

విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'VD 12' అనేది వర్కింగ్ టైటిల్. ప్రస్తుతం శ్రీలంకలో షూటింగ్ జరుగుతోంది. ఈ క్రమంలో లొకేషన్ నుంచి విజయ్ లుక్ కి సంబంధించిన ఫొటోలు లీక్ అయ్యాయి. షార్ట్ హెయిర్, గుబురు గడ్డంతో మాస్ లుక్ లో విజయ్ కొత్తగా కనిపిస్తున్నాడు. ఈ లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోయి.. సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలో మేకర్స్ ఓ ప్రకటన చేశారు.

విజయ్ అభిమానుల కోసం 'VD 12' చిత్ర బృందం కీలక ప్రకటన చేసింది. అద్భుతమైన థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ని అందించడం కోసం ఎంతో కష్టపడుతున్నామని, ఇప్పటికే 60 శాతం షూటింగ్ పూర్తయిందని, ప్రస్తుతం శ్రీలంకలో చిత్రీకరణ జరుగుతోందని తెలిపింది. త్వరలోనే ఫస్ట్ లుక్ ని అధికారికంగా విడుదల చేయబోతున్నామని, అప్పటివరకు ఎటువంటి లీక్డ్ ఫొటోలను షేర్ చేయవద్దని కోరింది.

లీక్ అయిన ఫొటోలు సోషల్ మీడియాని షేక్ చేస్తుండంతో.. సితార సంస్థ వీలైనంత త్వరగానే 'VD 12' ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసే అవకాశముంది. మరి ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ ని కూడా రివీల్ చేస్తారేమో చూడాలి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com