అశ్లీల చిత్రాల కేసులో హీరోయిన్ ఇంట్లో ఐటి సోదాలు..నిజం కాదన్న లాయర్
on Nov 30, 2024

విక్టరీ వెంకటేష్(venkatesth)హీరోగా 1996 లో వచ్చిన 'సాహసవీరుడు సాహసకన్య' చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన భామ శిల్పాశెట్టి(shilpa shetty).ఆ తర్వాత బాలకృష్ణ(balakrishna)మోహన్ బాబు(mohan babu)నాగార్జున(nagarjuna)వంటి హీరోలతో కూడా నటించి తెలుగు నాట మంచి గుర్తింపుని పొందింది.హిందీ,తమిళ,కన్నడ భాషల్లో కూడా కూడా పలు చిత్రాల్లో నటించిన శిల్ప శెట్టి 2009 లో ప్రముఖ బాలీవుడ్ నిర్మాత, వ్యాపార వేత్త రాజ్ కుంద్రాని వివాహం చేసుకుంది.
సినిమాలో అవకాశాల కోసం ముంబై వచ్చే యువతులని వంచించి, వారితో అశ్లీల చిత్రాలని నిర్మించి, వాటిని పలు యాప్ ల ద్వారా విడుదల చేసి పెద్ద ఎత్తున డబ్బు ఆర్జించిన కేసులో 2021 లో రాజ్ కుంద్రా అరెస్టయిన విషయం తెలిసిందే.ఈ కేసులో రాజ్ కుంద్రా(raj kundra)కొన్ని నెలల పాటు జైల్లో కూడా ఉన్నాడు.ఇప్పుడు ఈ కేసుకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో రాజ్ కుంద్రా కి చెందిన ముంబై, ఉత్తర ప్రదేశ్ లోని పదిహేను పాంత్రాల్లో ఈడి సోదాలు నిర్వహిస్తుందని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

వీటిపై శిల్పాశెట్టి లాయర్ మాట్లాడుతూ ఈడి సోదాల వార్త అబద్దం. రాజ్ కుంద్రా కేసు కి సహకరిస్తున్నారు. ఎవరు కూడా ఈ విషయంలో శిల్పా శెట్టి ఫోటోలు కానీ వీడియోలు కానీ ఉపయోగించవద్దు.ఒక వేళ ఎవరైనా ఉపయోగించిన యెడల చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం జరిగింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



