Home

»

Latest News

దేవర లోని జాన్వీకపూర్ యాక్టింగ్ కి మాజీ ముఖ్యమంత్రి మనవడి మైండ్ బ్లాంక్    

Sep 28, 2024 4:29PM

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా వరల్డ్ వైడ్ గా ఉన్న చాలా ఏరియాల్లో దేవర(devara)హంగామ కొనసాగుతు ఉంది. మొదటి రోజు నూట డెబ్భై రెండు కోట్లు ని రాబట్టి  రాబోయే రోజుల్లో మరిన్నిరికార్డులు సాధించే దిశగా ముందుకెళ్తుంది. మూవీ చూసిన ప్రతి ఒక్కరి నోటి వెంట దేవర పూర్తిగా ఎన్టీఆర్(ntr)వన్ మాన్ షో అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఇక  దేవరలో ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా కనిపించగా ఒక ఎన్టీఆర్ తో  శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్(janhvi kapoor)జోడి  కట్టింది.జత కట్టింది అనే కంటే తన అందంతో పాటు హుషారైన నటనతో ఒక్కసారిగా ప్రేక్షకులందర్నీ మెస్మరైజ్ చేసిందని చెప్పవచ్చు.ఇప్పుడు ఈ విషయం పైనే  జాన్వీ కపూర్  బాయ్ ఫ్రెండ్ శిఖర్ పహరియా(shikhar pahariya)కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసాడు. రీసెంట్ గా దేవరని వీక్షించిన శిఖర్  అందులోని  జాన్వీ స్క్రీన్ ప్రెజన్స్ కు ముగ్దుడయ్యి నేనేమైనా కలలో ఉన్నానా అనే కామెంట్ తో దేవర సినిమాలోని జాన్వీ పిక్ ని సోషల్ మీడియాలో షేర్ చేసాడు. 

జాన్వీ, శిఖర్ లు డేటింగ్ లో ఉన్నారనే వార్తలు ఎప్పటి నుంచో వస్తూనే ఉన్నాయి.కాకపోతే మా ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం పలానా అని ఆ ఇద్దరిలో ఎవరు కూడా చెప్పలేదు. ఇటీవల జాన్వీ ని  బాలీవుడ్ టాప్ టాక్ షో కాఫీ విత్ కరణ్ లో మీ స్పీడ్ డయల్ లిస్ట్ లో ఎవరెవరి నంబర్స్ ఉంటాయనే ప్రశ్న అడుగగా మా నాన్న,చెల్లి, శిఖర్ అని చెప్పింది  మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడే శిఖర్.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com