ఓటీటీలోకి ఆది సాయికుమార్ సూపర్ హిట్ మూవీ 'శంబాల'
on Jan 15, 2026

చాలా కాలం తర్వాత ఆది సాయికుమార్ కి రిలీఫ్ ఇచ్చిన మూవీ 'శంబాల'. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదలైన ఈ హారర్ థ్రిల్లర్.. వరల్డ్ వైడ్ గా రూ.20 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి, మంచి విజయం సాధించింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో అలరించడానికి సిద్ధమవుతోంది.
శంబాల' మూవీ ఆహా ఓటీటీలో ప్రీమియర్ కు రెడీ అవుతోంది. జనవరి 22 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కు వస్తోంది. ఆహా గోల్డ్ సబ్ స్క్రైబర్స్ ఒక రోజు ముందుగానే ఈ సినిమాను చూడొచ్చు.

మిస్టికల్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకులు ఆకట్టుకున్న 'శంబాల' సినిమాని దర్శకుడు యుగంధర్ ముని రూపొందించారు. అర్చన ఐయ్యర్ హీరోయిన్ గా నటించింది. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ పై మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీకి ప్రవీణ్ కె బంగారి విజువల్స్, శ్రీ చరణ్ పాకాల ఆర్ఆర్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
థియేటర్స్ లో మంచి వసూళ్లు సాధించిన శంబాల.. ఓటీటీలో కూడా అదే స్థాయి స్పందన తెచ్చుకుంటుందేమో చూడాలి.
Also Read: శంబాల మూవీ రివ్యూ
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



