Home

»

Latest News

మా ఇంట్లో గొడవలుంటాయి... మధ్యలో వస్తే ఎగరేసి నరుకుతా..

Jan 9, 2017 10:07AM

 

సినిమాలో బాలయ్య డైలాగ్స్ ఎలా చెబుతాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు స్టేజీల పైన కూడా అంతే ఆవేశంగా డైలాగ్స్ చెప్తూ అభిమానులను ఆనందంలో ముంచెత్తుతున్నాడు. ఆయన నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రం ఈ నెల 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆదివారం విశాఖలోని జ్యోతి థియేటర్ లో పతాక ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బాలయ్య గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రం కేవలం పతాకావిష్కరణ కాదు..శాతకర్ణి విజయానికి నాంది అని అన్నాడు. అక్కడితో ఆగకుండా ఇక్కడ మా ఇంట్లో గదికి గోడలుంటాయి. గొడవలుంటాయి. ఇది మా ఇల్లంటూ కొట్టుకుంటా.కానీ మధ్యలో ఇంకొకడు వచ్చి ఇది మా ఇల్లంటే ఎగరేసి నరుకుతా.. సరిహద్దుల్లో స్మశానం నిర్మిస్తాం.. మీ మొండేలను మా జెండాలా ఎగరేస్తాం అని ఆవేశంగా డైలాగ్ చెప్పాడు. మిత్రమా 12 న మా శాతకర్ణి చిత్రం విడుదల కాబోతోంది అని ఆయన ముగించాడు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com