Home

»

Latest News

'సర్కారువారి పాట' అప్డేట్ వచ్చేసింది.. మహేష్ ఫ్యాన్స్ కి పండగే

Jul 29, 2021 7:31PM

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరుశురామ్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'సర్కారువారి పాట'. ఇప్పటికే విడుదల చేసిన ప్రీ లుక్‌ కు మంచి స్పందన లభించింది. తాజాగా ఈ మూవీ నుంచి ఆసక్తికరమైన అప్ డేట్ వచ్చింది. ఈ నెల 31న మూవీ టీమ్ సర్‌ప్రైజ్‌ ఇవ్వనుంది. 

'సర్కారువారి పాట ఫస్ట్‌ నోటీస్‌'ను ఈ నెల 31న విడుదల చేయనున్నట్లు తెలియజేస్తూ తాజాగా ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఇందులో మహేష్ చేతిలో బ్యాగ్‌ పట్టుకుని స్టైల్ గా వాక్ చేస్తున్నాడు. ఈ పోస్టర్‌లో బైక్‌లు, కార్లు ఉన్నాయి. అలాగే కొందరు కింద పడిపోయి ఉన్నారు. పోస్టర్ ని బట్టి చూస్తుంటే ఇది ఒక యాక్షన్‌ సీన్‌ అని అర్థమవుతోంది. 31న విడుదల కానున్న ఫస్ట్‌ నోటీస్‌ ఇంకెంతలా ఆకట్టుకుంటుందో చూడాలి.

మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ ఎంటర్టయిన్ మెంట్, జీఎంబీ ఎంటర్టయిన్ మెంట్ సంయుక్తంగా సర్కారు వారి పాట చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇందులో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నాడు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com