Home

»

Latest News

మహానటిపై మహేష్ టీమ్ గుస్సా!

Jun 20, 2020

'సర్కారు వారి పాట'లో సూపర్‌స్టార్ మహేష్‌బాబుకు జోడీగా నటించే అవకాశం మహానటి కీర్తీ సురేష్‌కి దక్కింది. సినిమా ప్రకటించిన తరవాత కియారా అద్వానీ, పూజా హెగ్డే పేర్లు ప్రముఖంగా వినిపించినా... చివరికి కీర్తీ సురేష్‌కి మహేష్ టీమ్ ఓటు వేసింది. ఇప్పటివరకూ మహేష్, కీర్తీ జంటగా నటించలేదు కాబట్టి సిల్వర్ స్క్రీన్ మీద ఈ పెయిర్ ఫ్రెష్ గా ఉంటుందని ఫీల్ అయ్యారు. మంచి సమయం, సందర్భం చూసుకోని హీరోయిన్ సెలెక్ట్ చేసిన సంగతి అనౌన్స్ చేయాలనుకున్నారు. అయితే, ఆ కీర్తీ సురేష్ చేసిన పని వల్ల ఆ ప్లాన్స్ ప్లాప్ అయ్యాయి. 

'పెంగ్విన్' రిలీజ్ సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో కీర్తీ సురేష్ లైవ్‌లోకి వచ్చారు. ఆడియన్స్‌తో ఇంటరాక్ట్ అయ్యారు. మాటల మధ్యలో మహేష్ 'సర్కారు వారి పాట'లో తాను కథానాయికగా నటిస్తున్న విషయం వెల్లడించారు. దాంతో మహేష్ సినిమా టీమ్ షాక్ అయింది. షూటింగ్ స్టార్ట్ కావడానికి ఇంకా కొన్ని నెలల టైమ్ ఉండగా, అలా ఎలా అనౌన్స్ చేస్తుందని మహానటిపై గుర్రుగా ఉన్నారని టాక్. 
 
'గీత గోవిందం' తరవాత పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ తరవాత షూటింగ్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నా... లేట్ కావచ్చని టాక్. 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com