రామ్ చరణ్ పై సమంతకి ఉన్నఅభిప్రాయాన్ని ఆ హీరో వింటే కనుక ఏమైపోతాడో
on Oct 1, 2024
సౌత్ ఇండియన్ సినీ ప్రేమికులకి పరిచయం అక్కర్లేని పేరు సమంత(samantha)ఏ మాయ చేసావు మూవీ దగ్గరనుంచి ప్రేక్షకులని తన అద్భుతమైన నటనతో అలరిస్తూ అగ్ర హీరోయిన్ అనే టాగ్ లైన్ తో ముందుకు దూసుకుపోతుంది. తాజాగా సిటాడెల్ హనీ బన్నీ అనే హిందీ వెబ్ సిరీస్ ని కంప్లీట్ చేసిన సమంత మా ఇంటి మహాలక్ష్మి అనే ఇంకో మూవీలో కూడా చేస్తుంది. పైగా నిర్మాణ బాధ్యతలని కూడా తనే నిర్వహిస్తుంది. ]
రీసెంట్ గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(ram charan)తన గేమ్ చేంజర్(game changer)నుంచి సెకండ్ సాంగ్ గా రిలీజైన 'రా మచ్చా మచ్చా' అనే సాంగ్ ని సోషల్ మీడియా లోషేర్ చేస్తూ, ఈ సాంగ్ ని నేను ఆనందించినట్లుగా మీరు కూడా ఆనందిస్తారని ఆశిస్తున్నా అనే ఒక క్యాప్షన్ ని ఉంచాడు.దానికి సమంత స్పందిస్తూ నిన్నెవరు మ్యాచ్ చెయ్యలేరు.అన్ మ్యాచ్ బుల్, అసలు ఫార్మల్ ఫ్యా ఫాంట్, షర్ట్ ధరించి ఎవరు ఇలా డాన్స్ చెయ్యగలరు అంటూ రిప్లై ఇచ్చింది.దీంతో సమంత ఇచ్చిన రిప్లై ని చూసిన మెగా ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు.ఇక చిరంజీవి(chiranjeevi)కూడా ఈ మాటలు వింటే ఉప్పొంగిపోతాడనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు.
ఇక సమంత, చరణ్ ల కాంబోలో వచ్చిన రంగ స్థలం ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో అందరకి తెలిసిందే. మళ్ళీ ఈ ఇద్దరి కాంబోలో సినిమా రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇక చరణ్ ట్వీట్ కి ఉపాసన(upasana)కూడా తన స్పందనని తెలియచేసింది.మిస్టర్ సీ మీ డాన్స్ తో హై వోల్టేజ్ పుట్టించారని చెప్పుకొచ్చింది.ఈ ట్వీట్ కూడా ఒక రేంజ్ లోనే వైరల్ అవుతుంది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
