Home

»

Latest News

రజనీ కావాలంటే నాకు ఇంకో 20 యేళ్ళు పడుతుంది

Jul 24, 2011

"రజనీ కావాలంటే నాకు 20 యేళ్ళు పడుతుంది" అని ఒక ప్రముఖ హీరో ఈ మధ్య మీడియా ముందు అన్నాడు. ఎవరా హీరో...? ఏమా కథ...? అనే కదా మీ అనుమానం. అతనెవరో కాదు బాలీవుడ్ ప్రముఖ హీరో, హిందీ కండల కాంతారావ్ సల్మాన్ ఖాన్. ఆయనకు సౌతిండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ కూ ఏమిటి సంబంధం అంటే ఈ మధ్య ముంబయ్ లో జరిగిన ఒక పాత్రికేయుల సమావేశంలో విలేఖరులు "మీకు రజనీ కాంత్ లా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనుకుంటున్నారా....?" అని అడిగారు. దానికి సమాధానం దాటవేశాడు సల్మాన్ ఖాన్.

అయినా వారు వదలకపోయే సరికి "రజనీ కావాలంటే నాకు ఇంకో 20 యేళ్ళు పడుతుంది. అయినా ఆయన పొజి షన్ సంపాదించుకోవటం ఒక ఎత్తు...దాన్ని కాపాడుకోవటం ఒక ఎత్తు. అది అంత తేలిక కాదు. అయినా ప్రస్తుతం నేనున్న పొజిషన్ నాకు సంతృప్తికరంగానే ఉంది. నాకిది చాలు" అన్నారు. అంటే మన రజనీ కాంత్ అంటే బాలీవుడ్ హీరోలకు ఉన్న అభిప్రాయాన్ని సల్మాన్ ఖాన్ మాటల్లో తెలుస్తుంది కదూ...

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com