స్టూడియోలో రామ్ గోపాల్ వర్మ..కేజ్రీవాల్ తొమ్మిదిసార్లంటూ మెలిక
on Nov 30, 2024
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(ram gopal varma)ఆంధ్ర ప్రదేశ్ లో తన మీద నమోదైన పోలీసు కేసులో పరారీలో ఉన్న విషయం తెలిసిందే.పోలీసులు మాత్రం వర్మ కోసం రకరకాల చోట్లలో వెతుకుతూనే ఉన్నారు.కానీ వర్మ ఆచూకీ వాళ్ళకి చిక్కటం లేదు. కానీ ఇప్పుడు వర్మ ఒక టివి ఛానల్ లో ప్రత్యక్ష మయ్యాడు.
కొంత మందితో కలిసి డిబేట్ లో పాల్గొన్న వర్మ మాట్లాడుతు నేను విచారణకి హాజరవుతానని పోలీసులని ఒక డేట్ అడిగాను.కానీ ఆ డేట్ పోలీసులు నాకు ఇవ్వలేదు.పోలీసులు నన్ను అరెస్ట్ చెయ్యడానికి రాలేదు.వాళ్ళు ఫార్మాలిటీ గా నా డెన్ కి వచ్చారు. ఒక రెండు గంటల తర్వాత నేను నా డెన్ కి వచ్చినప్పుడు పోలీసులు లేరు.ఈ సారి మాత్రం పోలీసులు వచ్చి కారణం చెప్పి రమ్మంటే వెళ్తాను.తనపై నమోదయిన కేసులో అరవింద్ కేజ్రీ వాల్ తొమ్మిది సార్లు టైం అడిగాడు.నేను ఇంకో సారి అడుగుతున్నానని చెప్పుకొచ్చాడు.అలాగే పలువురు అడిగిన ప్రశ్నలకి తనదైన స్టైల్లో జవాబులు చెప్పాడు. ఈ చర్చ జరుగుతున్న సమయంలోనే వర్మ కళ్ళ వెంట కన్నీళ్లు కూడా వచ్చాయి. అరెస్ట్ అయితే పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారన్న భయము కూడా లేదు. అసలు 'లా' లో అలాంటి అవకాశమే లేదని చెప్పుకొచ్చాడు.
Also Read