ప్రభాస్ పెళ్లి కూతురు ఊరు ఇదేనా! అచ్చ తెలుగు అమ్మాయని ఫ్యాన్స్ ఆనందం
on Jan 11, 2025
పాన్ ఇండియా స్టార్ 'ప్రభాస్'(Prabhas)ప్రస్తుతం'ది రాజాసాబ్'(The raja saab)తో బిజీగా ఉన్నాడు.కానీ ఫ్యాన్స్ మాత్రం మా 'రాజాసాబ్'పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడా అని చాలా కాలం నుంచి ఎదురుచూస్తూ వస్తున్నారు.సోషల్ మీడియాలో అయితే ప్రభాస్ పెళ్లి పై వార్తలు రాని రోజు ఉండదంటే అతిశయోక్తి కాదు.కొన్నిసార్లయితే ప్రభాస్ పలానా హీరోయిన్ ప్రేమలో ఉన్నాడని,ఆ ఇద్దరి పెళ్లి కూడా త్వరలోనే ఉండబోతుందని,కాదు కాదు సినిమాలకి సంబంధం లేని అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడని, ఆ అమ్మాయి వాళ్ళ బంధువుల అమ్మాయే అని,ఇలా నిత్యం ఏదో ఒక న్యూస్ సర్క్యులేట్ అవుతూనే వస్తుంది.ఆ పుకార్ల సంగతి ఎలా ఉన్నా ఇప్పుడు మాత్రం ప్రభాస్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఊరు ఏంటో తెలిసిపోయింది.
ప్రభాస్ డియరెస్ట్ ఫ్రెండ్ గ్లోబల్ స్టార్ 'రామ్ చరణ్'(Ram Charan)లేటెస్ట్ గా ఆహా లో ప్రసారమయ్యే బాలయ్య(Balakrishna)అన్ స్టాపబుల్ షో కి గెస్ట్ గా వచ్చిన విషయం తెలిసిందే.మొదటి ఎపిసోడ్ ఈ నెల 8 న స్ట్రీమింగ్ కాగా రికార్డు వ్యూస్ ని రాబట్టింది.ఇక సెకండ్ ఎపిసోడ్ ఈ నెల 14 న స్ట్రీమింగ్ కానుంది.బాలయ్య ఈ ఎపిసోడ్ లో రామ్ చరణ్ ని ప్రభాస్ పెళ్లి గురించి అడిగినట్టుగా తెలుస్తుంది.దీంతో పెళ్లి కూతురు పేరు చరణ్ చెప్పకపోయినా,ఆంధ్రప్రదేశ్ లోని గణపవరానికి చెందిన అమ్మాయిని ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నాడని చరణ్ చెప్పినట్టుగా వార్తలు వస్తున్నాయి.ఇందుకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వస్తుండటంతో ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు కూడా ఫుల్ ఎపిసోడ్ కోసం ఎంతో ఆసక్తి తో ఎదురుచూస్తున్నారు.రామ్ చరణ్ లాంటి లెజండరీ యాక్టర్ ఆ మాట చెప్పడంతో తెలుగు అమ్మాయిని ప్రభాస్ పెళ్లి చేసుకోవడం పట్ల పలువురు సోషల్ మీడియా వేదికగా ప్రభాస్ కి అభినందనలు తెలుపుతున్నారు.
గణపవరం ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా మండల కేంద్రమైన భీమవరం నుండి 20 కిమీ దూరంలో ఉంది.ప్రభాస్ స్వగ్రామం మొగల్తూరు కూడా సమీపంలోనే ఉంది.మెగా స్టార్ చిరంజీవిది కూడా మొగల్తూరు అనే విషయం తెలిసిందే.ఇక ప్రభాస్ సినీ కెరీర్ ని చూసుకుంటే 'రాజా సాబ్' తర్వాత స్పిరిట్, సలార్ 2 ,హను రాఘవపూడి సినిమాల్ని వరుసగా చెయ్యబోతున్నాడు.
Also Read