ENGLISH | TELUGU  

రామ్ చరణ్ ని కలిసిన సుకుమార్ కూతురు 

on Jan 25, 2025

స్టార్ డైరెక్టర్ సుకుమార్(Sukumar)కూతురు సుకృతి వేణి(Sukriti veni)ప్రధాన పాత్రలో ఈ నెల 24 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ 'గాంధీ తాత గారి చెట్టు'(Gandhi Thatha chettu).పద్మావతి మల్లాది(Padmavathi Malladi)దర్శకత్వం వహించగా సుకుమార్ రైటింగ్స్,మైత్రిమూవీ మేకర్స్,గోపి టాకీస్ సంయుక్తంగా  నిర్మించడం జరిగింది.ఇక మూవీ చూసిన ప్రతి ఒక్కరినుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో పాటు బ్లాక్ బస్టర్ హిట్ అనే టాక్ కూడా వినపడుతుంది.

ఈ సందర్భంగా చిత్ర విజయంలో ప్రధాన భూమిక పోషించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున  గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)ఆయన సతీమణి ఉపాసన(Upasana)అభినందనలు చెప్పడం జరిగింది.ఈ మేరకు చిత్ర బృందం చరణ్ ఇంటికి వెళ్లి చరణ్,ఉపాసనకి తమ ధన్యవాదాలు చెప్పి ఫోటోలు దిగారు.సుకృత వేణితో పాటు సుకుమార్ సతీమణి తబిత(Tabitha)దర్శకురాలు పద్మావతి,నిర్మాత శేష సింధు రావులు దిగిన ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా నిలిచాయి.చరణ్ ఇటీవలే 'గేమ్ చేంజర్'(Game Changer)గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. 

మన దేశానికి స్వాతంత్య్రాన్ని సాధించి పెట్టిన 'మహాత్మగాంధీ'(Mahathma Gandhi)ఆశయాలని  అలవర్చుకుంటే వయసుతో సంబంధం లేకుండా ఒక పెద్ద సమస్యని కూడా ఎలాంటి హింసకి తావు లేకుండా పరిక్షరించుకోవచ్చో ఈ చిత్రం చాటి చెప్పిందనే అభిప్రాయం మూవీ చూసిన వారి నుంచి వ్యక్తమవుతుంది.'గాంధీ' టైటిల్ రోల్ లో సుకృతి వేణి ప్రదర్శించిన నటనకి మంచి ప్రశంసలు దక్కుతున్నాయి.

 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.