Home

»

Latest News

పునీత్‌ కుటుంబానికి చరణ్‌ పరామర్శ.. నమ్మలేకపోతున్నా అంటూ ఎమోషనల్

Nov 3, 2021 1:28PM

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఆకస్మిక మరణంతో టాలీవుడ్ లోనూ విషాద చాయలు అలుముకున్నాయి. పలువురు టాలీవుడ్ ప్రముఖులతో పునీత్ కి మంచి అనుబంధం ఉంది. నందమూరి హీరోలు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ అయితే పునీత్ ని తమ కుటుంబసభ్యుడిగా భావిస్తారు. పునీత్ అంత్యక్రియల్లో టాలీవుడ్ నుంచి చిరంజీవి, బాలకృష్ణ, తారక్ వంటి స్టార్స్ పాల్గొని నివాళులు అర్పిస్తున్నారు. మంగళవారం నాడు నాగార్జున పునీత్ నివాసానికి వెళ్లి ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. తాజాగా రామ్ చరణ్ కూడా పునీత్ కుటుంబసభ్యులను పరామర్శించి, అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.

రామ్ చరణ్ బుధవారం పునీత్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా చరణ్ మాట్లాడుతూ.. పునీత్ లేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని, సొంత కుటుంబ సభ్యులు దూరమైనట్టు ఉందని అన్నారు. పునీత్ లాంటి హంబుల్ పర్సన్ ని తాను ఎక్కడా చూడలేదని, ఆయన దగ్గర నుంచి చాలా నేర్చుకున్నానని చెప్పారు. పునీత్ చనిపోయారనే నిజాన్ని తాను నమ్మలేకపోతున్నాను అంటూ చరణ్ ఎమోషనల్ అయ్యారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com