Home

»

Latest News

హీరోగా, నిర్మాత‌గా చ‌ర‌ణ్ సేమ్ స్ట్రాట‌జీ!

Jan 27, 2022 3:57PM

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ మంచి న‌టుడు మాత్ర‌మే కాదు మంచి నిర్మాత కూడా. త‌న తండ్రి, మెగాస్టార్ చిరంజీవి రి-ఎంట్రీ మూవీ `ఖైదీ నంబ‌ర్ 150`తో పాటు చిరు డ్రీమ్ ప్రాజెక్ట్ `సైరా.. న‌ర‌సింహారెడ్డి`ని కూడా నిర్మించి త‌న అభిరుచిని చాటుకున్నారు చ‌ర‌ణ్. అలాగే నాన్న చిరుకి బ్యాక్ టు బ్యాక్ కెరీర్ హ‌య్య‌స్ట్ గ్రాస‌ర్స్ అందించి వార్త‌ల్లో నిలిచారు. అంతేకాదు.. నిర్మాణంలో బిజీగా ఉంటూనే క‌థానాయ‌కుడిగా సినిమాలు చేస్తూ వ‌చ్చారు.

ఇదిలా ఉంటే.. 2022 క్యాలెండ‌ర్ ఇయ‌ర్ రామ్ చ‌ర‌ణ్ కి ఎంతో స్పెష‌ల్ అనే చెప్పాలి. ఎందుకంటే.. త‌న కెరీర్ లో ఎన్న‌డూ లేని విధంగా ఒకే ఏడాదిలో అటు హీరోగా, ఇటు నిర్మాత‌గా క‌లుపుకుని మొత్తంగా మూడు సినిమాల‌తో ప‌ల‌క‌రించ‌బోతున్నారు. ఒక‌వైపు `ఆచార్య‌`, `ఆర్ ఆర్ ఆర్`తో త‌క్కువ గ్యాప్ లోనే న‌టుడిగా ఎంట‌ర్టైన్ చేయ‌నున్న చ‌ర‌ణ్.. మ‌రోవైపు `ఆచార్య‌`, `గాడ్ ఫాద‌ర్` సినిమాల‌తో ఇదే సంవ‌త్స‌రం నిర్మాత‌గానూ సంద‌డి చేయ‌నున్నారు. మ‌రి.. హీరోగా రెండు సినిమాల‌తో, నిర్మాత‌గా రెండు చిత్రాల‌తో ఒకే క్యాలెండ‌ర్ ఇయ‌ర్ లో సేమ్ స్ట్రాట‌జీ అప్ల‌య్ చేస్తున్న రామ్ చ‌ర‌ణ్.. ఎలాంటి ఫ‌లితాల‌ను అందుకుంటారో చూడాలి.

కాగా, ఏప్రిల్ 1న `ఆచార్య‌` విడుద‌ల‌కి సిద్ధ‌మ‌వుతుండ‌గా.. మార్చి 18న లేదా ఏప్రిల్ 28న `ఆర్ ఆర్ ఆర్` రాబోతోంది. ఇక `గాడ్ ఫాద‌ర్` విష‌యానికి వ‌స్తే.. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఈ సినిమా రిలీజ్ కానుంది.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com