ENGLISH | TELUGU  

పుష్ప తో మాకు ఎలాంటి సంబంధం లేదంటున్న హీరో  

on Nov 1, 2023

పలాస సినిమాతో అందరి హృదయాల్లో స్థానం సంపాదించుకున్న నటుడు రక్షిత్. తాజాగా నరకాసుర అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నవంబర్ 3  న విడుదల అవుతున్న ఈ సినిమా ఇంకో సినిమాకి పోలిక అని వస్తున్న రూమర్స్ మీద రక్షిత్ స్పందించాడు.

నరకాసుర సినిమా ట్రైలర్  ఇటీవలే రిలీజ్ అయ్యి సినిమాని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే క్యూరియాసిటీ ని ఆడియెన్స్ కి నరకాసుర కలిగించింది అనడం లో ఎలాంటి సందేహం లేదు. కానీ రీసెంట్ గా కొంత మంది నరకాసుర సినిమా పుష్ప సినిమా లాగ ఉంటుందనే రూమర్స్ వచ్చాయి. కానీ నరకాసుర సినిమా కి పుష్పకి ఎలాంటి పోలిక లేదని వాస్తవానికి పుష్ప మొదటి పార్ట్ సినిమా కంటే ముందే  2020 లోనే మా నరకాసుర సినిమా ప్రారంభం అయ్యింది. కొంత మంది  ఆర్టిస్ట్ ల డేట్స్ లు సర్దుబాటుగాక లేటయ్యిన సినిమా ఆ తర్వాత  కోవిడ్ వల్ల వాయిదా పడిందని ఆ తర్వాత  మా దర్శకుడికి ఆక్సిడెంట్ అయ్యి చేయి కోల్పోవడంతో సినిమా మరింత లేట్ అయ్యి ఇప్పుడు మీ ముందుకు వస్తుందని రక్షిత్ చెప్పాడు.ఒక వేళ న గెటప్ చూసి పుష్ప లాగ ఉంటుందని అనుకుంటున్నారేమో గాని మా సినిమా కి పుష్పకి సంబంధమే లేదని రక్షిత్ చెప్పుకొచ్చాడు. 
కాగా నరకాసుర కథ ఆంధ్ర, తమినాడు సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఒక కాఫీ ఎస్టేట్ ప్రాంతంలో జరగనుంది.  సినిమాలో హిజ్రాలకి సంబంధించిన సమస్యని కూడా చూపించబోతున్నారని తెలుస్తుంది. రక్షిత్ సరసన అపర్ణ జనార్దన్, సంకీర్తన విపిన్ లు హీరోయిన్లు గా నటిస్తున్న ఈ నరకాసుర చిత్రానికి సెబాస్టియన్ దర్శకత్వం వహిస్తుండగా ఐడియల్ ఫిలిం మేకర్స్ బ్యానర్ పై  డాక్టర్ అజ్జా శ్రీనివాస్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.