కమల్ హాసన్ ని పిలవాల్సింది.. ఎన్టీఆర్ శత జయంతి సభలో చేసిన వ్యాఖ్యలని గుర్తు చేసిన రజనీ
on Jul 12, 2025
తమిళ సూపర్ స్టార్ 'రజినీకాంత్'(Rajinikanth)తన అప్ కమింగ్ మూవీ 'కూలీ'(Coolie)తో ఆగష్టు 14 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. స్టార్ హీరో అక్కినేని నాగార్జున(Nagarjuna)ముఖ్య పాత్రలో చేస్తుండంతో పాటు, లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj)దర్శకుడు కావడంతో 'కూలీ'పై అభిమానులతో పాటు సౌత్ సినీ పరిశ్రమ ప్రేమికుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రీసెంట్ గా రజనీ చెన్నై వేదికగా జరిగిన 'వేల్పారి' పుస్తక విజయోత్సవ సభకి ముఖ్య అతిధిగా హాజరయ్యాడు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు రామకృష్ణ ఆశ్రమం(Ramakrishna Ashramam)వల్ల పుస్తక పఠనం అలవాటు అవ్వడంతో,ఇప్పటి వరకు ఎన్నో గొప్ప పుస్తకాలు చదివాను. 'వేల్పారి'(vel pari) పుస్తకం చదవడం ఇరవై ఐదు శాతం పూర్తి చేశాను. సినిమాల నుంచి రిటైర్ అయ్యాక మొత్తం కంప్లీట్ చేస్తాను. నిజానికి ఇలాంటి ఫంక్షన్స్ కి మేధావులైన కమల్ హాసన్ , శివకుమార్ లాంటి వాళ్ళని పిలవాలి. డెబ్భై ఐదేళ్ల వయసులో కూలింగ్ గ్లాస్ పెట్టుకొని స్లో మోషన్ లో నడిచే నన్ను ఎందుకు పిలిచారో అర్ధం కావడం లేదు. ఈ ఈవెంట్ లో ఆచితూచి మాట్లాడుకుంటున్నాను. గతంలో ఒక ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు 'మనం ఏం మాట్లాడాలనేది విజ్ఞానం. ఎలా మాట్లాడాలనేది ప్రతిభ. ఎంత మాట్లాడాలనేది స్టేజ్. ఏం చెప్పాలి. ఏం చెప్పకూడదు అనేది అనుభవం నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు అని చెప్పాను. దాంతో నా మాటలు వివాదానికి దారి తీశాయని చెప్పుకొచ్చాడు.
ఆంధ్రప్రదేశ్ లో గత సంవత్సరం జరిగిన సార్వత్రిక ఎన్నికలకి ముందు తెలుగుదేశం(TDP)పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్(Ntr)శత జయంతి ఉత్సవాలకి రజనీ హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఆయన పైన చెప్పిన వ్యాఖ్యలు చేసాడు. దాంతో అప్పటి ప్రభుత్వానికి చెందిన కొంత మంది రజనీ ని విమర్శించారు. ఇప్పుడు ఆ వ్యాఖ్యలని వేల్పారి పుస్తక సభలో రజనీ గుర్తు చేసుకోవడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత రచయిత 'సు వెంకటేశన్'(su Vekatesan)రాసిన ఉత్తమ రచనలలో 'వేల్పారి' కూడా ఒకటి. ప్రాచీన కాలంలో 'వేల్పారి' అనే రాజు తమిళ సాహిత్యానికి చేసిన కృషితో పాటు పలువురుతో చేసిన యుద్దాలు గురించి పుస్తకంలో ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
