Home

»

Latest News

షార్ట్ ఫిలింలో కమల్, రజనీ

Mar 07, 2011

kamal hassan rajanikanth, kamal hassan rajanikanth short film, kamal hassan short film, rajanikanth short film, kamal rajani short film గతంలో కమల్ హాసన్, రజనీకాంత్ కలసి తెలుగులో " అంతులేని కథ, అందమైన అనుభవం, వయసు పిలిచింది" వంటి అనేక చిత్రాల్లోనూ తమిళ్ లో"పదునారు వయదునిళే" వంటి సూపర్ హిట్ మూవీలోనూ నటించారు. ఆ తర్వాత రజనీకాంత్ సుపర్ స్టార్ గానూ, కమల్ హాసన్ లోకనాయకుడిగా మారిన తర్వాత మాత్రం రజనీకాంత్, కమల్ హాసన్ కలసి నటించలేదు. కమల్ హాసన్, రజనీ కాంత్ కలిపి ఒక చిత్రం తీయాలనుకున్న దర్శకుడు కె.యస్.రవికుమార్ ప్రయత్నించినా, అతనికి సాధ్యం కాక ఆ సినిమా కార్యరూపం దాల్చలేదు.


అయితే ప్రస్తుతం కమల్ హాసన్, రజనీకాంత్ లకు గురువైన దర్శకస్రష్ట కె.బాలచందర్ సలహా మేరకు వాళ్ళిద్దరు కలసి ఒక షార్ట్ ఫిలింలో నటించబోతున్నారు. ఈ షార్ట్ ఫిలిం నిర్మిస్తూంది ఒక మంచి పని కోసం కనుక కమల్ హాసన్, రజనీకాంత్ లు ఆ షార్ట్ ఫిలింలో నటించాల్సిందిగా బాలచందర్ ఆదేశించారు. తమకు గురువైన ఆయన మాటలను కాదనలేక కమల్ హాసన్, రజనీకాంత్ ఇద్దరూ ఆ షార్ట్ ఫిలింలో కలసి నటించటానికి నిర్ణయించుకున్నారు.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com