సైఫ్అలీఖాన్, టబు,సోనాలి బింద్రేకి షాక్ ఇచ్చిన ప్రభుత్వం..జైలు శిక్ష తప్పదా!
on May 17, 2025

ఒక వర్గం ప్రజలు 'కృష్ణజింక'(Krishna Jinka)అనే ఒక జంతువుని అత్యంత పవిత్రంగా పూజిస్తారు. ఈ కృష్ణ జింకని 1998 వ సంవత్సరంలో సల్మాన్ ఖాన్(Salman Khan)వేటాడి చంపాడని, రాజస్థాన్(Rajasthan)కోర్టు నిర్దారించి ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తు 2018 ఏప్రిల్ నెలలో తీర్పుని ప్రకటించింది. ప్రస్తుతం ఈ శిక్షకు సంబంధించిన వ్యవహారం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది. ఈ కృష్ణజింక విషయంలోనే గ్యాంగ్ స్టార్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి సల్మాన్ బెదిరింపులు కూడా ఎదుర్కుంటున్నాడు.
ఇక కృష్ణ జింక ని వేటాడి చంపిన కేసులో పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేసిన సమయంలో సల్మాన్ తో పాటు టబు(Tabu),సైఫ్ అలీ ఖాన్(Saif Ali khan)నీలం, సోనాలి బింద్రే(Sonali Bendre)వంటి తారల పేర్లు కూడా ఉన్నాయి. కాకపోతే కోర్టు సల్మాన్ ని మాత్రమే దోషిగా తేలుస్తు, మిగతా వాళ్ళని నిర్దోషులుగా ప్రకటించింది. ఇప్పుడు ఈ తీర్పుని వ్యతిరేకిస్తు రాజస్థాన్ ప్రభుత్వం తాజాగా హైకోర్టుని ఆశ్రయిస్తు పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ ని స్వీకరించిన కోర్టు తదుపరి విచారణని జులై 28 కి వాయిదా వేసింది.
ఇటీవల పహల్ గామ్ పై పాకిస్థాన్ కి చెందిన తీవ్రవాదులు దాడి చేసి ఇరవై మూడు మందిని చంపడం, మన వాళ్ళు ఆపరేషన్ సిందూర్ ని నిర్వహించి తీవ్రవాదుల్ని మట్టుబెట్టడం జరిగింది. దీంతో దేశంలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ టైంలో బాలీవుడ్ చిత్ర పరిశ్రమ నుంచి ఎవరు పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు. బాయ్ కాట్ బాలీవుడ్ అనే నినాదాలు కూడా సోషల్ మీడియాలో పలువురు వ్యక్తం చేసారు. అలాంటి ఈ సమయంలో ఏడు సంవత్సరాల క్రితం జిల్లా కోర్టు టబు, సైఫ్ అలీ ఖాన్, నీలం, సోనాలి బింద్రే ని నిర్దోషులుగా ప్రకటించిన తర్వాత, రాజస్థాన్ ప్రభుత్వం కృష్ణ జింక కేసులో హైకోర్టులో పిటిషన్ వెయ్యడం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



