ఇస్రో రాకెట్ కి బాహుబలి పేరు.. ఆకాశంలోకి పంపించాక జరిగింది ఇదే
on Nov 4, 2025

-బాహుబలి కి అరుదైన గౌరవం
-ఇస్రో రాకెట్ కి బాహుబలి పేరు
-రాజమౌళి ధన్యవాదాలు
-ఆకాశంలోకి వెళ్ళాక జరిగింది ఇదే
తెలుగు సినిమా కీర్తినే కాకుండా భారతీయ సినిమా కీర్తిని విశ్వవ్యాప్తం చేసిన చిత్రాలు బాహుబలి పార్ట్ 1 , పార్ట్ 2 . మొదటి భాగం థియేటర్స్ లో అడుగుపెట్టినప్పట్నుంచే బాహుబలి పేరుపై చాలా సంస్థలు,హోటల్స్ లాంటివి వెలిసాయి. పర్వదినాల సమయంలో కూడా తమ ఇష్టదైవాలైన దేవతామూర్తుల విగ్రహాలని బాహుబలి(Baahubali)అనే పేరుతో కొలుచుకున్న వారు కూడా ఎంతో మంది ఉన్నారు. అంతలా బాహుబలి పేరు భారతీయుల మనోఫలకాల్లో భద్రంగా దాగి ఉంది. రీసెంట్ గా బాహుబలి కి మరో అరుదైన గౌరవం దక్కింది.
భారతదేశ ప్రతిష్టకి తలమానికంగా నిలిచే భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో(ISro)రీసెంట్ గా ఎల్ వీఎం 3 -ఎల్ 5 రాకెట్ ని రూపొందించింది. ఈ రాకెట్ కి బాహుబలి అనే పేరుని నిర్ణయించారు. నిర్ణయించడమే కాదు గగనతలంలోకి బాహుబలి రాకెట్ సాయంతో కమ్యూనికేషన్ ఉపగ్రహం సీఎంఎస్ 3 ని పంపించి తమ ప్రయత్నంలో విజయం సాధించించడం జరిగింది. ఈ నేపథ్యంలో రాజమౌళి(SS Rajamouli)సోషల్ మీడియా వేదికగా ఇస్రో కి ధన్యవాదాలు తెలుపుతు 'అంతరిక్ష పరిశోధనలో మన సాంకేతిక బలాన్ని ప్రదర్శించిన క్షణాలు ఎంతో గర్వకారణం. బరువు, బలం కారణంగా ఆ రాకెట్ కి బాహుబలి అని ప్రేమగా పేరుని నిర్ణయించారు. ఈ విషయంలో మా బాహుబలి టీం మొత్తం సంతోషించిందని ఎక్స్ వేదికగా పోస్ట్ చేసాడు.
Also Read : అల్లు అర్జున్ కి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు.. అసలు సౌండ్ లేదేంటి..!
ఆగష్టు 15,1969 లో ఇస్రో స్థాపించబడింది. అంతరిక్ష సాంకేతికతని ఉపయోగించుకోవడంలో ఇస్రో ప్రధాన పాత్ర పోషించడంతో పాటు ఉపగ్రహ ప్రయోగ వాహనాలైన పిఎస్‌ఎల్‌వి, జిఎస్‌ఎల్‌విలను తయారు చేస్తుంది.భారతదేశం మరియు మానవాళికి బాహ్య అంతరిక్ష ప్రయోజనాలని అందించడం కూడా సంస్థ ప్రధాన లక్ష్యం. పూర్తి పేరు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



