Home

»

Latest News

రజనీ కాంత్ రాణాలో నాలుగు పాటలకు ట్యూన్ పూర్తి

Jul 24, 2011

రజనీ కాంత్ "రాణా" లో నాలుగు పాటలకు ట్యూన్ చేయటం పూర్తయిందట. వివరాల్లోకి వెళితే సౌతిండియన్ సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా, దీపిక పదుకునే, ఇలియానా హీరోయిన్లుగా, కె.యస్.రవికుమార్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో నిర్మించనున్న విభిన్నకథా చిత్రం "రాణా". ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకులు ఎ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. రజనీ కాంత్ "రాణా" చిత్రానికి ఇప్పటికి నాలుగు పాటలకు ట్యూనింగ్ చేయటం పూర్తయిందట.

ఆ ట్యూన్లను హీరో రజనీ కాంత్ విని ఒ.కె. చేయ్యాలట. కాకపోతే మరో రెండు వారాల విశ్రాంతి అనంతరం రజనీ కాంత్ ఈ నాలుగు పాటల ట్యూన్లనూ సంగీత దర్శకులు రెహమాన్ తో కూర్చుని వింటారట. ఈ రజనీ కాంత్ "రాణా" సినిమా మొదలుపెట్టిన రోజు నుండే చాలా ఆటమకాలను ఎదుర్కొంటోంది. రజనీ కాంత్ అనారోగ్యం పాలయ్యారు. రజనీ కాంత్ సింగపూర్ లో ట్రీట్ మెంట్ తీసుకుని ఇటీవలే చెన్నైకి తిరిగి వచ్చారు.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com