Home

»

Latest News

రామ్ చరణ్ రచ్చలో బికినీతో తమన్నా

May 16, 2011

రామ్ చరణ్ "రచ్చ"లో బికినీతో తమన్నా నటించబోతూందని ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి. వివరాల్లోకి వెళితే మెగాసూపర్ గుడ్ ఫిలింస్ పతాకంపై, రామ్ చరణ్ హీరోగా, మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా భాటియా హీరోయిన్ గా, " ఏమైంది ఈ వేళ " సినిమా ఫేం సంపత్ నంది దర్శకత్వంలో, యన్.వి.ప్రసాద్, పరాస్ జైన్ సంయుక్తంగా నిర్మిస్తున్న మాస్ మసాలా ఎంటర్ టైనర్ విభిన్నకథా చిత్రం" రచ్చ". రామ్ చరణ్ "రచ్చ" సినిమా కోసం హీరో రామ్ చరణ్ అమెరికాలోని మియామీలో కల అంతర్జాతీయ జిమ్ లో శరీర సౌష్టవాన్ని పెంచుకునేందుకు ప్రత్యేక శిక్షణ తీసుకుని, ఎయిట్ ప్యాక్ బోడీతో ఇండియాకి తిరిగొచ్చారు.

రామ్ చరణ్ "రచ్చ" మూవీకి ఇదొక ఆకర్షణ అయితే, ఈ సినిమాలో హీరోయిన్ తమన్నా భాటియా బికినీలో తన అందాలను ఆరబోయనుందని సమాచారం. ఈ మధ్య హీరోయిన్లంతా బికినీలతో తమ తమ అందాలను ప్రేక్షకుల కనుల పండుగ్గా చూపిస్తుంటే, తానెందుకు చూపకూడదనుకుందో ఏమో తమన్నా కూడా బికినీలో తన అందచందాలను ప్రేక్షకులకు నయనానందకరంగా చూపించబోతోంది.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com