Home

»

Latest News

14000 అడుగుల ఎత్తు నుంచి దూకేసింది!

Jul 08, 2016

మన తెలుగులో అనే కాదు దాదాపుగా అన్నీ భాషల చిత్రాల్లోనూ హీరోయిన్ ను సినిమాకు కేవలం ఓ అలంకారంగానే చూస్తుంటారు. మహా అయితే వారి చేత అనవసరమైన ఎక్స్ పోజింగ్ చేయించడం మినహా వారితో నటించడానికి పెద్దగా స్కోప్ ఇవ్వరు. అందుకే హీరోయిన్లను ఆడియన్స్ కూడా అందాల బొమ్మలుగానే చూస్తుంటారు. 

కానీ.. బొద్దుగుమ్మ రాశీఖన్నా మాత్రం నన్ను ఆ లిస్ట్ లో చేర్చకండి అంటోంది. అందుకు కారణం ఇటీవల అమ్మడు చేసిన సాహసమే. దాదాపు 14000 అడుగుల ఎత్తు నుంచి "స్కై డైవింగ్" చేసింది రాశీఖన్నా. ఇటీవల చికాగో వెళ్ళిన రాశీ.. అక్కడ ఈ సాహసకార్యాన్ని కావించింది. ఇకపోతే.. అమ్మడు గోపీచంద్ సరసన నటిస్తున్న "ఆక్సిజన్" చిత్రీకరణ చివరి దశలో ఉండగా.. ఇంకో నాలుగైదు ప్రొజెక్టులు ఆమె చేతిలో ఉన్నాయి. మొత్తానికి రాశీ హీరోయిన్ గా టాలీవుడ్ లో శాశ్వత స్థానాన్ని సంపాదించేసుకోవడంతోపాటు.. స్టార్ డమ్ ను కూడా ఎంజాయ్ చేస్తోంది! 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com