Home

»

Latest News

యూఎస్ కలెక్షన్స్ లో పుష్ప 2 సరికొత్త రికార్డు

Dec 05, 2024

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(allu arjun)రష్మిక,(rashmika)సుకుమార్(sukumar)మైత్రి మూవీ మేకర్స్(mythri movie makers)కాంబోలో  తెరకెక్కిన పుష్ప 2(pushpa 2)ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎలా అయితే నాల్గవ తేదీ నుంచి ప్రీమియర్స్ షోస్ పడ్డాయో,యుఎస్ లో కూడా ఒక రోజు ముందుగానే ప్రీమియర్ షోస్ వేయడం జరిగింది.

దీంతో ప్రీసేల్స్ తోనే పుష్ప ఏకంగా 3 .2 మిలియన్ డాలర్ మార్క్ గ్రాస్ ని అందుకుంది.ఇలా రిలీజ్ కి ముందే ప్రీ సేల్స్ లో పుష్ప 2 యు ఎస్ లో 3.2 మిలియన్ డాలర్స్ మార్క్ ని దాటడం ఒక రికార్డు అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ముందు ముందు పుష్ప 2 ఇంకెన్ని రికార్డులు సాధిస్తుందో చూడాలి.ఇక ఈ రికార్డుపై పుష్పని యుఎస్ లో డిస్ట్రిబ్యూట్ చేసిన ప్రత్యంగిరా సినిమాస్ అధికారకంగా ఒక పోస్టర్ రిలీజ్ చెయ్యడమే కాకుండా బాక్స్ ఆఫీస్ కి కాపలా కాయండి. అల్లు అర్జున్ లాంటి శక్తీ సరిహద్దుల్ని విచ్చినం చేస్తుందంటూ సోషల్ మీడియా వేదికగా తెలియచేసింది.

 

 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com