పుష్ప 2 సెకండ్ డే షాకింగ్ కలెక్షన్స్
on Dec 7, 2024

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(allu arjun)వన్ మాన్ షో పుష్ప 2(pushpa 2)ఇప్పుడు ఇండియా వైడ్ గా రికార్డు కలెక్షన్స్ ని సృష్టిస్తుంది. డిసెంబర్ 5 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ తొలి రోజే వరల్డ్ వైడ్ గా రెండు వందల తొంబై నాలుగు కోట్ల రూపాయల కలెక్షన్ ని సాధించిన ఫస్ట్ ఇండియన్ మూవీగా నిలిచింది.
ఇక రెండో రోజు కూడా అదే సత్తాని కొనసాగిస్తూ ముందుకు వెళ్తున్న పుష్ప రెండో రోజు కూడా భారీ కలెక్షన్స్ ని సాధిస్తూ టోటల్ గా రెండు రోజులకి కలిపి మొత్తం నాలుగు వందల కోట్ల రూపాయలని వసూలు చేసింది.వీటిలో ఏరియా వారిగా ఎంత వసూలు చేసిందనే వివరాలు కూడా రానున్నాయి. ఇక రెండు రోజులకే నాలుగు వందల కోట్ల కలెక్షన్స్ ని సాధించడంతో రిలీజ్ కి ముందు పుష్ప 2 చిత్ర యూనిట్ బావించినట్టుగా వెయ్యి కోట్ల టార్గెట్ పెద్ద కష్టమేమి కాదని అనిపిస్తుందని సినీ ట్రేడ్ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.
సంక్రాంతి దాకా అన్ని లాంగ్వేజెస్ లో కూడా బడా హీరోల సినిమాలు లేకపోవడం పుష్పకి కలిసొచ్చే అవకాశం. సుకుమార్(sukumar)దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో రష్మిక(rashmika) హీరోయిన్ కాగా ఫాహద్ ఫాజిల్, జగపతిబాబు, రావు రమేష్, సునీల్, అనసూయ కీలక పాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్(devi sri prasad)సంగీతాన్ని అందించగా మైరోస్లా కూబా బ్రోజెక్ (Miroslaw Kuba Brozek)ఫొటోగ్రఫీ బాధ్యతని అందించాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service





.webp)

.webp)






.webp)
