Home

»

Latest News

పుష్ప 2 కి తెలంగాణ హైకోర్టు లైన్ క్లియర్ 

Dec 03, 2024

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్(allu arjun)వన్ మాన్ షో పుష్ప 2(pushpa 2)ఈ నెల ఐదున విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.దీంతో ఆన్ లైన్ వేదికగా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవ్వగా,రికార్డు స్థాయిలో టికెట్స్ అమ్ముడయ్యాయి.ఇక మూవీ మేకర్స్ రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల దగ్గర పర్మిషన్ తీసుకొని టికెట్ రేట్స్ ని పెంచడం జరిగింది.దీనిపై తెలంగాణ కి చెందిన జర్నలిస్ట్ సతీష్ కుమార్ అధిక మొత్తంలో టికెట్ చార్జీలు వసూలు చేయడాన్ని అడ్డుకోవాలని తెలంగాణ హైకోర్టు లో పిటిషన్ వేసాడు.

తన పిటిషన్ లో అధిక రేట్స్ తో పాటు బెనిఫిట్ షో పేరుతో ఎనిమిది వందలు వసూలు చేయడం అన్యాయమని పేర్కొన్నాడు.దీంతో ఇప్పుడు ఈ విషయంపై కోర్టు తన తీర్పుని ప్రకటించింది. చివరి నిమిషంలో సినిమా రిలీజును ఆపలేమని తెలపడంతో పాటుగా, తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది.


 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com