నేషనల్ కాదు ఇంటర్నేషనల్.. పుష్పరాజ్ రప్ప రప్పకి వెస్ట్రన్ ఆడియన్స్ ఫిదా!
on Feb 5, 2025
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన సినిమా 'పుష్ప 2'. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ మూవీ డిసెంబర్ లో థియేటర్లలో విడుదలై, వరల్డ్ వైడ్ గా రూ.1800 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి, ఇండియన్ సినీ చరిత్రలో సరికొత్త రికార్డులు సృష్టించింది. ఇటీవల 'పుష్ప 2' నెట్ ఫ్లిక్స్ వేదికగా ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఇప్పుడు ఈ సినిమా గురించి గ్లోబల్ వైడ్ గా అందరూ గొప్పగా మాట్లాడుతున్నారు. "నేషనల్ కాదు ఇంటర్నేషనల్" అని 'పుష్ప 2'లోని డైలాగ్ కి తగ్గట్టుగానే ఈ సినిమా గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చించుకుంటున్నారు. (Pushpa 2 The Rule)
'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు లభించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు 'పుష్ప 2' కూడా అదే బాటలో పయనిస్తోంది. హాలీవుడ్ ఆడియన్స్ ఈ సినిమాకి ఫిదా అయిపోతున్నారు. 'పుష్ప 2' క్లైమాక్స్ లో వచ్చే రప్ప రప్ప ఫైట్ సీన్ ని ఒక విదేశీ నెటిజెన్ ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేయగా, కేవలం గంటల వ్యవధిలోనే 20 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయి. వేల కొద్దీ కామెంట్స్ వస్తున్నాయి. ఆ కామెంట్స్ అన్నీ దాదాపు విదేశీయులవే కావడం. పైగా ఇప్పుడు వస్తున్న హాలీవుడ్ సినిమాలు ఈ స్థాయిలో ఉండట్లేదు అంటూ 'పుష్ప 2'ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. మార్వెల్ సినిమాలలో ఇలాంటి క్రియేటివిటీ ఉండట్లేదని కామెంట్స్ చేస్తున్నారు. ఎందరో వెస్ట్రన్ ఆడియన్స్ 'పుష్ప 2' సినిమా గురించి తెలుసుకోవడానికి, సినిమా చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుత రెస్పాన్స్ చూస్తుంటే, పుష్పరాజ్ పేరు మరికొద్ది రోజుల్లో గ్లోబల్ వైడ్ గా మారుమోగిపోయేలా ఉంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
