'పుష్ప-2' మ్యూజిక్ సిట్టింగ్స్ షురూ.. అవుట్ పుట్ మామూలుగా ఉండదు
on Aug 9, 2022

'పుష్ప: ది రైజ్' విజయంలో సాంగ్స్ కూడా కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. సినిమాలో ఉన్న ఐదు పాటలూ చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. దీంతో సెకండ్ పార్ట్ గా రానున్న 'పుష్ప: ది రూల్' సాంగ్స్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో పార్ట్-1 కి మించిన సాంగ్స్ తో అలరించడానికి మూవీ టీమ్ కసరత్తులు చేస్తోంది.
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా ఫిల్మ్ 'పుష్ప: ది రైజ్' గతేడాది డిసెంబర్ 17న విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది. బన్నీ మ్యానరిజమ్స్ కి, స్టెప్పులకి సెలెబ్రిటీలు సైతం ఫిదా అయ్యారు. ఇక ఇందులోని సాంగ్స్ అయితే ఒక ఊపు ఊపాయి. ముఖ్యంగా 'ఊ అంటావా మావ', 'సామి సామి', 'శ్రీవల్లి' సాంగ్స్ ఇప్పటికీ మారుమోగిపోతున్నాయి. స్క్రిప్ట్ పరంగా పార్ట్-1ని మించి పార్ట్-2 మరింత పవర్ ఫుల్ గా ఉండనుందని భావిస్తున్న ప్రేక్షకులు.. సాంగ్స్ కూడా అంతకుమించి ఉండబోతున్నట్లు అంచనాలు పెంచేసుకుంటున్నారు. ఆ అంచనాలు అందుకునే దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టింది మూవీ టీమ్.
పుష్ప పార్ట్-1 కి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించగా అందులోని ఐదు పాటలకు చంద్రబోస్ సాహిత్యం(తెలుగు వెర్షన్) అందించారు. వీరి కాంబోలో వచ్చిన పాటలకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు పుష్ప పార్ట్-2 తో మరోసారి తమ కాంబో పవర్ చూపించడానికి సిద్ధమవుతున్నారు. తాజాగా పుష్ప-2 మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలయ్యాయి. దేవి, చంద్రబోస్ తో కలిసి మ్యూజిక్ సిట్టింగ్స్ లో పాల్గొంటున్న సుకుమార్.. మ్యూజిక్ పరంగా పార్ట్-1 కి మించిన అవుట్ పుట్ వచ్చేలా భారీ కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



