Home

»

Latest News

మాఫియా చేతుల్లోకి ప్రభాస్ కల్కి.. టికెట్ బుకింగ్ లో సరికొత్త స్కామ్ 

Jun 24, 2024 12:13PM

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ (prabhas)తో యాంగ్రీ యంగ్ మెన్ రాజశేఖర్ (rajasekhar)పోటీకి దిగబోతున్నాడు.ఇందుకు నిదర్శనంగా  ప్రభాస్ (prabhas)కల్కి కలెక్షన్స్ ని కూడా లాక్కుంటున్నాడు. ఏంటండీ జోక్ చేస్తున్నారా అని అనుకుంటున్నారా! జోక్ కాదు నిజం.  కల్కి రిలీజ్ డేట్  అయిన  జూన్ 27 నే తన మూవీని కూడా రిలీజ్ చెయ్యబోతున్నాడు. మీరు చెప్పేది అబద్దం అని అర్ధమవుతుంది కానీ. అసలు విషయం చెప్పమంటారా! సరే అసలు మ్యాటర్ కి వద్దాం.
  

 బుక్ మై షో లో  కల్కి టికెట్స్  బుకింగ్ ని ఎప్పుడు లోడ్ చేస్తారా,  బుక్ చేసుకుందామని  ఫ్యాన్స్ నిద్రాహారాలు మాని  ఎదురు చూస్తున్నారు. దాంతో  కల్కి బుకింగ్ ఎంత స్పీడ్ గా లోడ్ అయ్యిందో, ఫ్యాన్స్ అంతే స్పీడ్ గా  బుక్ చేసుకున్నారు. ఆ తర్వాత తమ ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి కల్కి టికెట్  సంపాదించాను అని సగర్వంగా  చెప్పారు. దాంతో వాళ్లంతా ఈర్ష్యకి గురవుతున్నారనుకోండి. ఇక టికెట్ బుక్  చేసుకున్నవాళ్ళు  మరోసారి టికెట్ ని చూసుకొని మురిసిపోవాలనుకున్నారు.దాంతో ఒక్క సారిగా వాళ్ళ  కళ్ళు బైర్లు కమ్మాయి. ఎందుకంటే అది ప్రభాస్ కల్కి టికెట్ కాదు. రాజశేఖర్ కల్కి టికెట్. అవును ప్రభాస్ కల్కి టికెట్ అనుకోని రాజశేఖర్ కల్కి ని బుక్ చేసుకున్నారు. అసలు 2019 లో వచ్చిన కల్కి ఇప్పుడు బుక్ మై షో లో ఎందుకు ఉందనేది ఎవరికీ అర్ధం కావటం లేదు. ఫ్యాన్స్ అయితే అదేదో పెద్ద మాఫియా పని లాగా అనిపిస్తుందని అంటున్నారు. 

కాకపోతే ఫ్యాన్స్ కి ఊరట నిచ్చే అంశం ఏంటంటే రాజశేఖర్ కల్కికి బుక్ చేసినా కూడా అది ప్రభాస్ కల్కి కే వర్తిస్తుందని బుక్ మై షో  హామీ ఇచ్చింది.  కానీ ఫ్యాన్స్ అయితే  రాజశేఖర్  కల్కిని ట్రోల్ చెయ్యడం మానటం లేదు. గతంలో రిలీజ్ టైం లో హౌస్ ఫుల్ కాలేదని ఇప్పుడు  టైం చూసి వదిలారా  అంటూ దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. అయితే రాజశేఖర్ ఈ విషయంపై  స్పందించాడు. ఇప్పుడు జరిగిన దానిపై  తనకు ఎలాంటి  సంబంధం లేదని  నవ్వుతున్న ఎమోజీలను షేర్ చేసాడు. అలాగే  ప్రభాస్ కల్కికి బెస్ట్ విషెస్  చెప్పాడు. ప్రభాస్ కల్కి వల్ల  రాజశేఖర్ కల్కి చాలా ఏరియాల్లో హౌస్ ఫుల్ కావడం గమనార్హం.రాజశేఖర్ కల్కి కి ప్రశాంత్ వర్మ దర్శకుడు. ఇటీవల హనుమన్ తో పాన్ ఇండియా రేంజ్ లో  మంచి విజయాన్ని అందుకున్నాడు.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com