పవన్ కళ్యాణ్ సాంగ్ రాగానే నా ఫ్రెండ్స్ పారిపోయేవాళ్లంటున్న ప్రభాస్
on Nov 11, 2024

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(prabhas)ఈనాడు టెలివిజన్ ఛానల్ లో ప్రసారమవుతున్న నా ఉచ్ఛ్వాసం కవనం(naa uchvasam kavanam)అనే ప్రోగ్రాంలో పాల్గొంటున్న విషయం తెలిసిందే. ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి(Sirivennela Sitaramasastri)కి నివాళులు అర్పిస్తూ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో శాస్త్రి గారితో తనకున్న అనుబంధాన్ని ప్రభాస్ పంచుకుంటున్నాడు.
రీసెంట్ గా మూడో ఎపిసోడ్ విడుదల అయ్యింది.అందులో ప్రభాస్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్(pawan kalyan)హీరోగా వచ్చిన జల్సా(jalsa)సినిమాలోని చలోరే చలోరే సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం.నేను ఏ పార్టీకి వెళ్లినా కూడా దాని గురించే చర్చిస్తాను. అలా ఎన్ని సార్లు చర్చించానో లెక్కే లేదు. పార్టీలో ఆ సాంగ్ ప్లే చెయ్యగానే ఎక్కడ మళ్ళీ దాని గురించి చెప్తానో అని మా ఫ్రెండ్స్ పారిపోయే వాళ్ళు. ఆ పాట చరణంలో రక రకాల ముసుగులు వేస్తూ ఎప్పుడో మర్చిపోయాం సొంత ముఖం అని వస్తుంది. ప్రత్యేకించి ఆ లైన్ అంటే ఎంత ఇష్టమో చెప్పలేను.శాస్త్రి గారు సినిమా స్టోరీ కోసం రాసినా మన లైఫ్ స్టైల్స్ గురించే రాసారని అనిపిస్తుంది.
శాస్త్రి గారు మనీ(money)సినిమాలో భద్రం బీ కేర్ ఫుల్ బ్రదర్ భర్తగా మారకు బ్యాచిలర్ అని పెళ్లికి వ్యతిరేకంగా చెప్పారు. పెళ్లి పవిత్రత గురించి కూడా చాలా పాటలు రాసారు.మరి నేను ఇప్పుడు పెళ్లి చేసుకోవాలా వద్దా అని నవ్వుతు చెప్పాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



