Home

»

Latest News

"భక్త కన్నప్ప" రీమేక్

Jan 21, 2012

"భక్త కన్నప్ప" రీమేక్ చేస్తానని రెబెల్ స్టార్ కృష్ణంరాజు అన్నారు. వివరాల్లోకి వెళితే తన జన్మదినం సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను ప్రస్తుతం ప్రభాస్ తో కలసి లారెన్స్ దర్శకత్వంలో వస్తున్న "రెబెల్" చిత్రంలో నటిస్తున్నాననీ, లారెన్స్ తన పాత్రను బాగా తీర్చిదిద్దాడనీ అన్నారు. తాను త్వరలో దర్శకత్వం చేస్తాననీ, తాను తీయబోయే చిత్రం సమాజంలోని సమస్యల గురించీ, వాటి పరిష్కారం గురించీ ఉంటుందనీ అన్నారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ ప్రభాస్ సినీ కేరీర్ తాను అనుకున్న దానికన్నా చాలా బాగుందనీ, ప్రభాస్ ని పెట్టి "భక్తకన్నప్ప" చిత్రాన్ని రీమేక్ చెయ్యాలని ఉందనీ, కానీ అదెప్పటికి కుదురుతుందోననీ ఆయన అన్నారు. "భక్త కన్నప్ప" చిత్రంలో కృష్ణంరాజు, వాణీశ్రీ జంటగా నటించగా, బాపు దర్శకత్వంలో కృష్ణంరాజే స్వయంగా నిర్మించారు. ఈ చిత్రం ఒక క్లాసిక్ చిత్రంగా తెలుగు సినీ పరిశ్రమలో స్థానం సంపాదించుకుంది.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com