Home

»

Latest News

ఫ్యామిలీతో పవన్ కళ్యాణ్.. ఎప్పుడు ఎక్కడో తెలుసా..?

Jun 23, 2024 3:45PM

జూన్ 12న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఆరోజు పవన్ అభిమానులకు ఫొటోలు, వీడియోల రూపంలో ఎన్నో మెమోరీస్ లభించాయి. అయితే ఆరోజు ఫ్యామిలీతో దిగిన బ్యూటిఫుల్ ఫొటో ఒకటి కాస్త ఆలస్యంగా బయటకు వచ్చింది.

తాజాగా జనసేన పార్టీ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ లో "ట్రాఫిక్ చిక్కులు ఇచ్చిన చక్కటి ముచ్చట" అంటూ ఫ్యామిలీతో పవన్ కళ్యాణ్ దిగిన ఫొటోని షేర్ చేసింది. అంతేకాదు, "ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ నెల 12న ప్రమాణ స్వీకారం చేసిన తరవాత క్లిక్ అనిపించిన అందమైన ఫోటో ఇది. ప్రమాణ స్వీకారం చేసి మంగళగిరిలో నివాసానికి బయలుదేరాలనుకొంటే - ట్రాఫిక్ చిక్కులు ఏర్పడ్డాయి. వాహనాన్ని రోడ్డు పక్క నిలిపివేసి సేద తీరిన క్షణంలో సతీమణి శ్రీమతి అనా కొణిదెల గారు, పిల్లలు అకీరా నందన్, ఆద్యలతో తీసుకున్న ఫోటో ఇది" అంటూ ఆ ఫొటో వెనుకున్న స్టోరీని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బెస్ట్ పిక్ అంటూ పవన్ అభిమానులు సంబరపడుతున్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com