Home

»

Latest News

Parthiban: ఉస్తాద్ భగత్ సింగ్ పార్తీబన్ కులం విషయంలో హైకోర్టు కీలక తీర్పు.. దేశం ఎటువైపు వెళ్తుంది

Apr 21, 2026

  

 

-రీసెంట్ గా  ఉస్తాద్  పవన్ తో మెరిసిన పార్తీబన్ 
-పార్తీబన్ కులం విషయంలో హైకోర్టు తీర్పు 
-ఎంతో మందికి కనువిప్పు కలగనుందా!


దేశ సమగ్రతకి కులం, మతం, భాష, ప్రాంతం అనేవి ఎంత ప్రమాదకరమో పాలు తాగే పసి పిల్లాడిని అడిగినా చెప్తాడు. దేవుడు సైతం ప్రత్యక్షమయ్యి ఏ వరం కావాలో కోరుకో నేను అర్జెంటుగా వెళ్లాలని మొత్తుకుంటున్నా, మళ్ళీ పిలిచినప్పుడు వద్డువులే అని  కులం, మతం, భాష గొడవలోనే ఉంటారు. రీసెంట్ గా చెన్నై హైకోర్టు  ప్రముఖ తమిళ నటుడు పార్తీబన్ కి  కుల మతాలకి అతీతంగా సర్టిఫికెట్ ఇవ్వాలని తీర్పు ప్రకటించింది. పైన చెప్పుకున్న న్యూస్ కి చెన్నై హై కోర్ట్ తీర్పుకి పోలికలు దగ్గరగానే ఉందని అనిపిస్తున్నా అసలు న్యూస్ ఏంటో అర్ధం కావడం లేదు కదా!. మరి అసలు మ్యాటర్   ఏంటో చూద్దాం. 

పార్తీబన్(Parthiban)మార్చి 20న వేలచ్చేరి తహసీల్దార్‌కి ఒక దరఖాస్తు సమర్పించాడు. సదరు దరఖాస్తులో నేను 1958లో జన్మించినప్పటికీ, తల్లిదండ్రులు జనన ధృవీకరణ పత్రాన్ని తీసుకోలేదు. పాత ఎస్‌ఎస్‌ఎల్‌సీ విధానంలో చదువు మధ్యలోనే ఆపేయడం వల్ల తన వద్ద విద్యార్హత పత్రాలు కూడా లేవు. కాబట్టి  నో కాస్ట్, నో రిలీజియన్ సర్టిఫికెట్ ని ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నాడు. కులం,మతం అనేవి దేశ సమగ్రతకి ముప్పు అనేది పార్తీబన్  భావన. కానీ ఎన్నికల విధుల కారణంగా అధికారులు స్పందించలేదు. దీంతో  పార్తీబన్ చెన్నైలోని  మద్రాస్ హైకోర్టుని ఆశ్రయించాడు.

 పార్తీబన్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు తన ఆదేశాల్లో వారం రోజుల్లోగా నటుడు పార్తీబన్‌కి కులమతాలకి  అతీతమైన ధృవీకరణ పత్రాన్ని అందించాలని సంబంధిత జిల్లా కలెక్టర్‌కి ఆదేశాలు జారీ చేసింది. ఆ ప్రక్రియ మొత్తాన్ని  పూర్తి చేసి, ఆ వివరాలని ఈ నెల 29 న నివేదించాలని కూడా కోర్టు స్పష్టం చేసింది. తమిళనాడులో ఇప్పటికే స్నేహా అనే మహిళ ఇలాంటి సర్టిఫికేట్ పొంది చరిత్ర సృష్టించగా, ఇప్పుడు ఒక సెలబ్రిటీ హోదాలో ఉండి పార్తీబన్ ఈ అడుగు వేయడం విశేషం. తన సంతానానికి కూడా భవిష్యత్తులో వారి ఇష్టానుసారం జీవించే స్వేచ్ఛ ఉంటుందని కూడా ఆయన ఒక సందర్భంలో  వెల్లడించడం విశేషం.

also read:  Biker: ఓటిటిలోకి బైకర్.. డేట్ ఇదే!

ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో మనిషికి మనిషికి మధ్య అడ్డుగోడగా ఉన్న  కులం, మతం  కూలిపోయినప్పుడే నిజమైన మానవత్వం వర్ధిల్లుతుంది. ఆయన నిర్ణయం రాబోయే తరాలకి ఒక కొత్త మార్గాన్ని చూపిస్తుందనే కామెంట్స్ చేస్తున్నారు. ఇది నిజం కూడా..  పార్తీబన్ గత మూడు దశాబ్దాలపై నుంచే పాన్ ఇండియా నటుడిగా అన్ని భాషల చిత్రాల్లో చేస్తూ వస్తున్నాడు. తెలుగులోను చాలా చిత్రాల్లో చేసిన పార్తీబన్ రీసెంట్ గా పవన్(Pawan Kalyan)తో కలిసి  ఉస్తాద్ భగత్ సింగ్ లో నెగిటివ్ రోల్ లో మెప్పించిన విషయం తెలిసిందే.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com