Home

»

Latest News

ఫిబ్రవరి 2 న రానున్న "నిప్పు"

Jan 02, 2012

వై.వి.యస్.చౌదరి ప్రొడక్షన్స్, బొమ్మరిల్లువారి పతాకాలపై, మాస్ మహరాజా రవితేజ హీరోగా, దీక్షా సేథ్ హీరోయిన్ గా, డైనమిక్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో, ప్రముఖ నిర్మాత, దర్శకుడు అయిన వై.వి.యస్.చౌదరి నిర్మిస్తున్న విభిన్న కథా చిత్రం "నిప్పు. ఈ "నిప్పు" చిత్రం 2011 "మే" 28 వ తేదీన కీర్తి శేషులు యన్.టి.ఆర్. జయంతి రోజున లాంఛనంగా ప్రారంభమైంది. ఆగస్టు 1 వ తేదీ నుండి ఆగకుండా డిసెంబర్ 20 వ తేదీ వరకూ అంటే పూర్తయ్యేవరకూ ఈ "నిప్పు" చిత్రం షూటింగ్ జరిగింది.

ఈ "నిప్పు" చిత్రం నిజానికి సంక్రాంతి పండుగకే విడుదల కావలసింది. కానీ ఈ "నిప్పు"చిత్రానికి అవసరమైన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇంకా పూర్తికాకపోవటంతో ఈ చిత్రం విడుదల అనివార్యంగా ఆలస్యమవుతోంది. ఈ "నిప్పు"చిత్రం ఫిబ్రవరి 2 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుందని ఈ చిత్ర నిర్మాత వై.వి.యస్.చౌదరి జనవరి ఒకటవ తేదీన,ప్రసాద్ ల్యాబ్ లో మీడియాకు తెలియజేశారు.

ఈ సందర్భంగా ప్రముఖ పాత్రికేయులు, "సూపర్ హిట్" పత్రికాధిపతి, నిర్మాత అయిన బి.ఎ.రాజు చేతుల మీదుగా ఈ "నిప్పు" చిత్రం డిజిటల్ పోస్టర్ ని విడుదల చేయించటం జరిగింది. తమన్ సంగీతం అందించిన ఈ "నిప్పు" చిత్రం ఆడియోని జనవరి 7 వ తేదీన మార్కెట్లోకి విడుదల చేయనున్నారు.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com