టామ్ క్రూజ్ ని కలిసిన నీహారిక.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు
on May 17, 2025

హాలీవుడ్ అగ్ర హీరో 'టామ్ క్రూజ్'(Tom Crusie)నటించిన 'మిషన్ ఇంపాసిబుల్ ది ఫైనల్ రెకనింగ్'(Mission Impossible The Final Reckoning)మూవీ ఈ రోజు వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిన్న ఈ మూవీకి సంబంధించిన ప్రీమియర్ 'యూకే'(UK)లో జరగగా, ఎవరు ఊహించని విధంగా పలు దేశాలకి చెందిన సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్స్ ని ప్రీమియర్ కి ఆహ్వానించడం జరిగింది. ఈ క్రమంలో ప్రముఖ సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సుర్(Social Media Influencer)'నీహారిక'(Niharika)కూడా ప్రీమియర్ షో లో పాల్గొని టామ్ క్రూజ్ తో కలిసి ఫోటోలు దిగింది. స్వయంగా టామ్ క్రూజ్ నే నీహారిక చేయి పట్టుకొని ఫోటో షూట్ కి తీసుకెళ్లడంతో ఆమె ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతోంది.
ఈ విషయంపై రీసెంట్ గా నీహారిక ఇనిస్టా వేదికగా స్పందిస్తు'వరల్డ్ వైడ్ గా ఉన్న యాక్షన్ ప్రియులు ఎంతగానో అభిమానించే టామ్ క్రూజ్ ని కలవడం ఎంతో ఆనందంగా ఉంది. అది నిజమని నమ్మడానికి చాలా కాలం సమయం పట్టింది. పైగా కలలో కూడా ఇలాంటిది ఊహించలేదంటూ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారగా పలువురు నెటిజన్లు నీహారిక ని అభినందిస్తున్నారు.
మార్చి 14 న తమిళ ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'పెరుసు'(Perusu)అనే మూవీలో హీరోయిన్ గా చేసిన నీహారిక ప్రస్తుతం పలు కొత్త రకాల సినిమాలు చేస్తు బిజీగా ఉంది. పెరుసు మూవీ తెలుగులో కూడా ఓటిటి ద్వారా ప్రేక్షకుల ముందుకు రాగా ప్రముఖ దర్శకుడు కోదండరామిరెడ్డి కొడుకు వైభవ్ హీరోగా కూడా చేసాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



