
టాలీవుడ్ లో 'చిరు లీక్స్'కి మామూలు క్రేజ్ లేదు. మెగాస్టార్ చిరంజీవి తన అప్ కమింగ్ సినిమాల గురించి లీక్స్ ఇస్తుంటారు. ఈ ఆనవాయితీ ఎప్పటినుంచో కొనసాగుతోంది. తాజాగా 'కొరియన్ కనకరాజు' సక్సెస్ మీట్ లో చిరంజీవి తన కొత్త సినిమా 'మెగా 158' టైటిల్ లీక్ చేసి, సర్ప్రైజ్ చేశారు.
చిరంజీవి హీరోగా బాబీ కొల్లి దర్శకత్వంలో రూపొందుతోన్న మూవీ 'మెగా 158'. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా అప్డేట్ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా సర్ప్రైజ్ ఉంటుందని అభిమానులు ఆ రోజు చూస్తున్నారు. అయితే అంతకంటే ముందే చిరు సర్ప్రైజ్ ఇచ్చారు.
మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తో మాట్లాడుతూ.. ఆగస్టు 22న టీజర్ రిలీజ్ అవుతుంది. ఆ టీజర్ కి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇస్తున్న టైంలో టైటిల్ చూశావా. 'కదిరి' కదా" అంటూ టంగ్ స్లిప్ అయ్యారు.
గతంలో ఈ సినిమాకి 'కాకాజీ' అనే టైటిల్ ప్రచారం జరిగింది. ఇప్పుడు చిరు లీక్స్ తో టైటిల్ అది కాదని క్లారిటీ వచ్చింది. మరి టైటిల్ 'కదిరి' అని మాత్రమే ఉంటుందా? కొనసాగింపుగా ఇంకా ఏమైనా ఉంటుందా? అనేది ఆగస్టు 22న క్లారిటీ రానుంది.
Chiru Leaks, Mega 158, Chiranjeevi






