Home

»

Latest News

పాలిటిక్స్ ఖాయమా!: జార్ఖండ్ విద్యార్థులకి అండగా పుష్ప

Aug 10, 2026 7:08PM

 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం 'రాకా'తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇటీవలే తన ఫ్యాన్స్ తో హైదరాబాద్ లో ఫ్యాన్ మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్లందరికీ పలు విషయాలపై అవగాహనా కార్యక్రమం ఏర్పాటు చేసాడు. ఈ మీటింగ్ ఏర్పాటుతో అల్లు అర్జున్ రాజకీయాల్లోకి వస్తున్నాడనే న్యూస్ కూడా వైరల్ గా మారింది. ఇప్పుడు అంతకు మించిన న్యూస్ ఒకటి వైరల్ గా మారింది.


జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (JPSC), జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (JSSC) నియామక పరీక్షల్లో జరిగిన తీవ్ర అక్రమాలు, అవకతవకలకు నిరసనగా వేలాది మంది నిరుద్యోగ యువకులు, విద్యార్థులు రోడ్డుపైకి వచ్చి చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. అయితే, ఈ భారీ పోరాటంలో అందరి దృష్టిని ఆకర్షించి, సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిన ఒక ప్రత్యేక సంఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అల్లు అర్జున్ బ్లాక్‌బస్టర్ చిత్రం 'పుష్ప'లోని ఐకానిక్ లుక్‌లో ఓ యువకుడు ప్రత్యక్షమై అందరినీ ఆశ్చర్యపరిచాడు. మెడలో బంగారు గొలుసులు, చేతి వేళ్లకు మెరిసే ఉంగరాలు, పుష్ప రాజ్‌కు సరిపోయేలా హెయిర్ స్టైల్, గెటప్‌తో మహారాష్ట్ర నుంచి రాంచీకి వచ్చిన సదరు యువకుడు విద్యార్థుల నిరసన ప్రదర్శనలో పాల్గొన్నాడు. 'పుష్ప' చిత్రంలో "పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావా.. ఫైర్!" అని చెప్పినట్టుగానే, అతడు కూడా విద్యార్థుల తరఫున గట్టి స్వరంతో నినదించాడు. "జార్ఖండ్‌ విద్యార్థులు జూకరు.. ఆగరు.. వారికి న్యాయం జరిగే వరకు వెనక్కి తగ్గరు" అంటూ పుష్ప స్టైల్లో డైలాగ్ చెబుతూ ఆందోళనకారుల్లో నూతన ఉత్సాహాన్ని నింపాడు. ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద జరిగిన వివిధ ఆందోళనలకు పెద్ద ఎత్తున ప్రముఖులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు మద్దతు తెలిపిన విషయాన్ని ప్రస్తావిస్తూ, జార్ఖండ్ విద్యార్థులు పడుతున్న వేదన కూడా జాతీయ మీడియా దృష్టికి వెళ్లాలని, ఇక్కడి నిరుద్యోగులకు తక్షణమే పూర్తిస్థాయిలో ఆమోదయోగ్యమైన న్యాయం జరగాలని అతడు పిలుపునిచ్చాడు.


Also read: గోల్డెన్ ఛాన్స్: కల్కి 2 కాస్టింగ్ కాల్: ప్రభాస్ సినిమాటిక్ యూనివర్స్‌లో మీరు ఉండవచ్చు

దీంతో సినిమా పాత్రలు కేవలం వెండితెరపై వినోదాన్ని పంచడానికే పరిమితం కావు. కొన్నిసార్లు సమాజంలో జరిగే పోరాటాలకి, అన్యాయాలపై గొంతెత్తే ఉద్యమాలకు అవి శక్తివంతమైన ఆయుధాలుగా మారతాయనే విషయం అందరకి అర్థమైంది.  

  Alli Arjun, Pushpa, jharkhand

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com