Home

»

Latest News

క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' ట్విట్టర్ రివ్యూ.. సినిమాలో మైనస్‌లు ఇవే.!

Jul 17, 2026 9:51AM

హాలీవుడ్ సంచలన దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన విజువల్ వండర్ ‘ది ఒడిస్సీ’ (The Odyssey) థియేటర్లలోకి అడుగుపెట్టింది. లెజెండరీ గ్రీక్ కావ్యం ఆధారంగా రూపొందిన ఈ మైథలాజికల్ యాక్షన్ ఎపిక్‌పై సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘ఎక్స్’ (ట్విట్టర్) లో నెటిజన్లు తమ ఫస్ట్ రివ్యూలను పంచుకుంటున్నారు. 

నోలన్ గత చిత్రం 'ఓపెన్‌హైమర్' తర్వాత వస్తున్న సినిమా కావడంతో వరల్డ్ వైడ్‌గా దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టే థియేటర్ల వద్ద అభిమానుల కోలాహలం కనిపిస్తోంది. ముఖ్యంగా ఐమాక్స్ 2డి, 4డిఎక్స్ ఫార్మాట్లలో ఈ సినిమాను చూసేందుకు ఆడియన్స్ ఎగబడుతున్నారు. నోలన్ మరోసారి తన మార్క్ విజువల్స్, మేకింగ్ స్టైల్‌తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాడని మెజారిటీ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

ఈ సినిమాలో కింగ్ ఒడిస్సీ పాత్రలో నటించిన హాలీవుడ్ స్టార్ మ్యాట్ డామన్ (Matt Damon) నటనకు సోషల్ మీడియాలో విశేషమైన రెస్పాన్స్ వస్తోంది. ఒక వీరుడిగా మాత్రమే కాకుండా, అతని వెనుక ఉన్న భావోద్వేగపూరితమైన మనిషిని కూడా మ్యాట్ డామన్ అద్భుతంగా పండించాడని నెటిజన్లు కొనియాడుతున్నారు. ఒడిస్సీ భార్య పెనెలోప్ పాత్రలో ఆన్ హాత్వే (Anne Hathaway), ఎథీనా దేవిగా జెండయా (Zendaya) తమ నటనతో మెప్పించారు. ఇక ఒడిస్సీ కుమారుడు టెలిమాకస్ పాత్రలో టామ్ హాలండ్ (Tom Holland) నటన గుండెలను పిండేసేలా ఉందని, తండ్రీకొడుకుల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ చూసి థియేటర్లలో కన్నీళ్లు పెట్టుకున్నామని కొందరు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. విలన్ పాత్ర అయిన యాంటినస్ రోల్‌లో రాబర్ట్ ప్యాటిన్సన్ (Robert Pattinson) నటన పర్ఫెక్ట్‌గా సెట్ అయిందని కామెంట్లు వస్తున్నాయి.

అయితే ఈ సినిమాపై ట్విట్టర్‌లో కొన్ని మిశ్రమ స్పందనలు కూడా వ్యక్తమవుతున్నాయి. నోలన్ విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టాప్ నాచ్‌గా ఉన్నప్పటికీ.. స్క్రీన్‌ప్లే కొంత నెమ్మదిగా సాగిందని కొందరు రివ్యూ ఇస్తున్నారు. డ్రామా ఎలిమెంట్స్ రొటీన్‌గా ఉన్నాయని, అలాగే కొన్ని చోట్ల సౌండ్ మిక్సింగ్ సరిగ్గా లేకపోవడం వల్ల డైలాగ్స్ సరిగ్గా వినబడలేదని కొంతమంది నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. సినిమా ప్రారంభంలో ట్రాయ్, స్పార్టా, ఇథాకా ప్రపంచాన్ని పరిచయం చేయడానికి దర్శకుడు ఎక్కువ సమయం తీసుకున్నాడని, ఆ తర్వాతే అసలు కథనం స్పీడందుకుంటుందని అభిప్రాయపడుతున్నారు.

ఈ నెగటివ్ పాయింట్స్ ఎలా ఉన్నా, సినిమా క్లైమాక్స్ మాత్రం అందరినీ మెస్మరైజ్ చేస్తోంది. ముఖ్యంగా లాస్ట్ 30 నుండి 40 నిమిషాల ఎపిక్ ఫినాలే సినిమాకే హైలైట్‌గా నిలిచిందని నెటిజన్లు చెబుతున్నారు. హోమర్ రాసిన అసలైన కావ్యం ఏ స్థాయిలో అయితే ఉంటుందో, నోలన్ చివర్లో అదే స్థాయి ఎమోషన్, యాక్షన్, డ్రామాను వెండితెరపై ఆవిష్కరించాడని కామెంట్స్ చేస్తున్నారు. యాక్షన్, అడ్వెంచర్, ఎమోషన్, హ్యూమర్ కలగలిసిన ఒక పక్కా కమర్షియల్ సినిమా ఇదని, ఐమాక్స్ స్క్రీన్‌లపై మాత్రమే చూడదగ్గ అద్భుత దృశ్యకావ్యమని నెటిజన్లు తేల్చి చెప్తున్నారు. ఓవరాల్‌గా క్రిస్టోఫర్ నోలన్ ఖాతాలో మరో బ్లాక్‌బస్టర్ పడినట్టేనని నెటిజన్ల టాక్ స్పష్టం చేస్తోంది.

 

 

The Odyssey Review, Christopher Nolan, Matt Damon, The Odyssey, Movie Review

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com