Home

»

Latest News

డిసెంబర్ రేసులో ప్రియదర్శి.. 'ఇడుపు కాయితం' ఫ‌స్ట్ వీక్ రిలీజ్‌.!

Jul 11, 2026 6:06PM

టాలీవుడ్‌లో విభిన్నమైన మరియు కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ఇద్దరు అగ్ర నిర్మాతలు చేతులు కలిపితే ఆ క్రేజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టాలెంటెడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తన సొంత బ్యానర్ సుకుమార్ రైటింగ్స్‌, యంగ్ ప్రొడ్యూసర్ బన్నీ వాస్ తన "బన్నీ వాస్ వర్క్స్" బ్యానర్‌పై సంయుక్తంగా ఒక సరికొత్త క్రేజీ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశారు. ఈ విలక్షణమైన చిత్రంలో టాలెంటెడ్ యాక్టర్ ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. యువ దర్శకుడు వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి "ఇడుపు కాయితం" అనే విభిన్నమైన, వెరైటీ టైటిల్‌ను ఖరారు చేశారు మేకర్స్.

పూర్తిగా తెలంగాణ ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్ స్టోరీతో అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనింగ్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం, ఇటీవలే సినీ ప్రముఖుల సమక్షంలో వైభవంగా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. ఈ సినిమా అనౌన్స్ అయిన అతి తక్కువ సమయంలోనే "ఇడుపు కాయితం" అనే విలక్షణమైన టైటిల్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. అసలు ఈ టైటిల్ వెనుక ఉన్న నేపథ్యం ఏంటి, కథ ఏమై ఉంటుంది అనే ఆసక్తి తెలుగు సినీ లవర్స్‌లో రోజురోజుకూ పెరిగిపోతోంది. టైటిల్‌తోనే సెన్సేషన్ క్రియేట్ చేస్తూ ప్రేక్షకుల్లో భారీ హైప్ తీసుకొచ్చిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌కు కూడా సోషల్ మీడియాలో విపరీతమైన రెస్పాన్స్ దక్కింది.

ఈ సినిమాలో తెలంగాణ ప్రసిద్ధ జానపద గీతాల ద్వారా డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ పై, ముఖ్యంగా యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌లో విపరీతమైన క్రేజ్ మరియు పాపులారిటీ తెచ్చుకున్న ప్రముఖ నటి నాగదుర్గ హీరోయిన్‌గా వెండితెరకు పరిచయం కాబోతోంది. ప్రియదర్శి, నాగదుర్గల విభిన్నమైన కాంబినేషన్‌తో పాటు ఈ చిత్రంలో ఒక అద్భుతమైన హోమ్లీ స్టార్ కాస్టింగ్ ఉండటం విశేషం. బుల్లితెరపై మరియు సోషల్ మీడియాలో అలరించే శివజ్యోతి (తీన్మార్ సావిత్రి), సుజాత (జోర్దార్), చంద్రవ్వ, మౌనిక రెడ్డి, రచ్చరవి, బిత్తిరి సత్తి, అభయ్ బేతిగంటి, మైమ్ మధు వంటి ఎంతోమంది గుర్తింపు తెచ్చుకున్న నటీనటులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించబోతున్నారు.

ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులను వేగంగా ముగించుకున్న ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించుకోనుంది. ఎలాంటి బ్రేకులు లేకుండా, సింగిల్ షెడ్యూల్‌లో శరవేగంగా షూటింగ్ పూర్తి చేసేందుకు చిత్రబృందం పక్కా ప్లాన్ రెడీ చేసుకుంది. ఈ ఏడాది డిసెంబర్ ఫస్ట్ వీక్‌లోనే ఈ సినిమాను గ్రాండ్‌గా థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు. సుకుమార్ మార్క్ స్క్రీన్ ప్లే వాల్యూస్, బన్నీ వాస్ ప్రొడక్షన్ ప్లానింగ్, ప్రియదర్శి మార్క్ కామెడీ అండ్ ఎమోషన్స్ కలగలిసిన "ఇడుపు కాయితం" బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

 

 

Idupu Kayitham, Priyadarshi New Movie, Sukumar Writings, Bunny Vas, Nagadurga Heroine, Idupu Kayitham Release Date

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com